నీవు నేనుఁ జాలదా నేరుపులే కలితేను
(॥పల్లవి॥)
నీవు నేనుఁ జాలదా నేరుపులే కలితేను
వేవేలుగ వలపులు వెదచల్లేటందుకు
(॥నీవు॥)
నగవులేమిటికి నాలిసేసి నీవు నన్ను
పొగరులఁ గాఁగిలించి పొందేయందుకు
తగవులేమిటికి తరుణలఁ గూడపెట్టి
మొగిఁ గంకణదారము ముంచి కట్టేయందుకు
(॥నీవు॥)
చెనకులేమిటికి చేసన్నలకు లోనై
తనివంద నీవు నాకు దక్కేయందుకు
ననుపులేమిటికి నమ్మించి నీవు నాపై
పెనఁగి నిండుసేసలు పెట్టేయందుకు
(॥నీవు॥)
పంతములేమిటికి పైపై నిందరిలోన
యింతేసిచనువు నాకిచ్చేయందుకు
కాంతుఁడ శ్రీవేంకటేశ గక్కునఁ గూడితి నన్ను
బంతిబాసలేమిటికి బతికించేయందుకు
(||pallavi||)
nīvu nenum̐ jāladā nerubule kalidenu
veveluga valabulu vĕdasalleḍaṁdugu
(||nīvu||)
nagavulemiḍigi nālisesi nīvu nannu
pŏgarulam̐ gām̐giliṁchi pŏṁdeyaṁdugu
tagavulemiḍigi taruṇalam̐ gūḍabĕṭṭi
mŏgim̐ gaṁkaṇadāramu muṁchi kaṭṭeyaṁdugu
(||nīvu||)
sĕnagulemiḍigi sesannalagu lonai
tanivaṁda nīvu nāgu dakkeyaṁdugu
nanubulemiḍigi nammiṁchi nīvu nābai
pĕnam̐gi niṁḍusesalu pĕṭṭeyaṁdugu
(||nīvu||)
paṁtamulemiḍigi paibai niṁdarilona
yiṁtesisanuvu nāgichcheyaṁdugu
kāṁtum̐ḍa śhrīveṁkaḍeśha gakkunam̐ gūḍidi nannu
baṁtibāsalemiḍigi badigiṁcheyaṁdugu