నీవు నేను గురిగాక నెలఁత లెందరు లేరు
(॥పల్లవి॥)
నీవు నేను గురిగాక నెలఁత లెందరు లేరు
కైవసమైనమీఁదఁ గల్లలాడేవా
(॥॥)
చేసినచేఁతలెల్లా చెలిచేత వింటిమి
రాసితో నీవానతియ్యవలెనా మాకు
వోసరించి యేడలేనివొట్టులు వెట్టుకోనేల
కాసుచేయనిపనికి కల్లలాడేవా
(॥॥)
కమ్మటి నీపనులెల్లా కన్నులెదుటఁ గంటిమి
యెమ్మెలు నాకుఁ జూపనేఁటికి నీవు
నమ్ముమని చేయిచ్చి నన్ను భ్రమయించనేల
కమ్ముక యింతదొరవు కల్లలాడేవా
(॥॥)
ననుపైననీవలపు నాకునాకే యెఱిఁగితి
యెనసి తలఁపించఁగ లా నీకు
అనుఁగు శ్రీ వేంకటేశ అలమేల్మంగను నేను
ఘనత నన్నేలితివి కల్లలాడేవా
(||pallavi||)
nīvu nenu gurigāga nĕlam̐ta lĕṁdaru leru
kaivasamainamīm̐dam̐ gallalāḍevā
(||||)
sesinasem̐talĕllā sĕliseda viṁṭimi
rāsido nīvānadiyyavalĕnā māgu
vosariṁchi yeḍalenivŏṭṭulu vĕṭṭugonela
kāsuseyanibanigi kallalāḍevā
(||||)
kammaḍi nībanulĕllā kannulĕduḍam̐ gaṁṭimi
yĕmmĕlu nāgum̐ jūbanem̐ṭigi nīvu
nammumani seyichchi nannu bhramayiṁchanela
kammuga yiṁtadŏravu kallalāḍevā
(||||)
nanubainanīvalabu nāgunāge yĕṟim̐gidi
yĕnasi talam̐piṁcham̐ga lā nīgu
anum̐gu śhrī veṁkaḍeśha alamelmaṁganu nenu
ghanada nannelidivi kallalāḍevā