నీవు నన్ను రక్షించితే నింద నీపైఁ బడదు
(॥పల్లవి॥)
నీవు నన్ను రక్షించితే నింద నీపైఁ బడదు
భావించి నన్నెట్టయినా బ్రదికించుకొనవే
(॥నీవు॥)
సంతతము నన్నెంచితే సర్వాపరాధి నేను
యెంత నే వేమిచేసినా నంత కర్హుఁడ
అంతటి లోకజననియైన లక్ష్మిఁ జూచి కాని
అంతరాత్మ నిన్నుఁ జూచియైనా మన్నిఁ చవే
(॥నీవు॥)
కలవెన్నైనాఁ దప్పులు కనఁగొన నావల్ల
చెలఁగి యందుకుఁ బ్రాయశ్చిత్తము లేదు
లలి నాభుజము చక్రలాంఛనము చూచి కాని
అల నానోరిమంత్రమైనాఁ జూచి యేలుమీ
(॥నీవు॥)
మతి నిన్నెఱిఁగేనంటే మదోన్మత్తుఁడ నేను
గతి యేది నాకు శ్రీవేంకటగిరినాయక
సతతము నీబిరుదు సారెకుఁ జూచి కాని
ప్రతిలేని నీదయయైనా భావించి చేకొనవే
(||pallavi||)
nīvu nannu rakṣhiṁchide niṁda nībaim̐ baḍadu
bhāviṁchi nannĕṭṭayinā bradigiṁchugŏnave
(||nīvu||)
saṁtadamu nannĕṁchide sarvābarādhi nenu
yĕṁta ne vemisesinā naṁta karhum̐ḍa
aṁtaḍi logajananiyaina lakṣhmim̐ jūsi kāni
aṁtarātma ninnum̐ jūsiyainā mannim̐ save
(||nīvu||)
kalavĕnnainām̐ dappulu kanam̐gŏna nāvalla
sĕlam̐gi yaṁdugum̐ brāyaśhchittamu ledu
lali nābhujamu sakralāṁchhanamu sūsi kāni
ala nānorimaṁtramainām̐ jūsi yelumī
(||nīvu||)
madi ninnĕṟim̐genaṁṭe madonmattum̐ḍa nenu
gadi yedi nāgu śhrīveṁkaḍagirināyaga
sadatamu nībirudu sārĕgum̐ jūsi kāni
pradileni nīdayayainā bhāviṁchi segŏnave