Neevu naagu valaduvu ne neegu meludaana

నీవు నాకు వలతువు నే నీకు మేలుదాన
Language

(॥పల్లవి॥)
నీవు నాకు వలతువు నే నీకు మేలుదాన
కావరపు నీ చేఁతలు కడుమంచివయ్యా

(॥నీవు॥)
అంత నీకు బాఁతైన ఆసలమోసమే కాక
యెంతైనా నీకు మోసమేడయ్యా
మంతనాన మిమ్ము రేఁచే మరునినేరమిగాక
పంతములో నీనేరాలు పట్టఁగ నేలయ్యా

(॥నీవు॥)
మగువుకు మోహించిన మనుసు దోసము గాక
జగములో నీవల్ల దోసమేదయ్యా
మొగమోడించి మరిపే మోవిదే కొరతగాక
తగవెంచి నీకొరత దడవనేలయ్యా

(॥నీవు॥)
ఇదే నన్నుఁ బెండ్లి సేసిరి(న?) చుట్టాలనవ్వేఁ గాక
మది మది నిన్ను నవ్వ మాకేలయ్యా
యెదుట శ్రేవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
మొదల వెంగెమాడితి మొక్కు మొక్కేనయ్యా

(||pallavi||)
nīvu nāgu valaduvu ne nīgu meludāna
kāvarabu nī sem̐talu kaḍumaṁchivayyā

(||nīvu||)
aṁta nīgu bām̐taina āsalamosame kāga
yĕṁtainā nīgu mosameḍayyā
maṁtanāna mimmu rem̐se marunineramigāga
paṁtamulo nīnerālu paṭṭam̐ga nelayyā

(||nīvu||)
maguvugu mohiṁchina manusu dosamu gāga
jagamulo nīvalla dosamedayyā
mŏgamoḍiṁchi maribe movide kŏradagāga
tagavĕṁchi nīgŏrada daḍavanelayyā

(||nīvu||)
ide nannum̐ bĕṁḍli sesiri(na?) suṭṭālanavvem̐ gāga
madi madi ninnu navva māgelayyā
yĕduḍa śhreveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
mŏdala vĕṁgĕmāḍidi mŏkku mŏkkenayyā