Neevu naagu daamsanela nijasuddi

నీవు నాకు దాఁచనేల నిజసుద్ది
Language

(॥పల్లవి॥)
నీవు నాకు దాఁచనేల నిజసుద్ది
చేవదేర వేదములో చెప్పేటి సుద్ది

(॥నీవు॥)
నిండెను లోకములోన నీవు గోపికలనెల్లా
అండనే బలిమిసేతువన్న సుద్ది
మెండాయ నదివొ నీమేనమామఁ జంపి
దండిమధుర సతులఁ దగిలిన సుద్ది

(॥నీవు॥)
వింటిమి సీతకుఁగాను వేవేలుకోఁతులఁ గూడి
బంటతనమున పాటువడ్డ సుద్ది
కంటిమి సిగ్గువిడిచి కడు బురసతులకై
గెంటక బిత్తలేతిరిగినసుద్ది

(॥నీవు॥)
నెగడె వరాహమవై నీమేనిరోఁత చూడక
పొగడి భూపతి నీవుపొందిన సుద్ది
అగడాయ శ్రీవేంకటాధిప నీ విందిరమ
తగ మెడఁగట్టుకొని దైవమైన సుద్ది

(||pallavi||)
nīvu nāgu dām̐sanela nijasuddi
sevadera vedamulo sĕppeḍi suddi

(||nīvu||)
niṁḍĕnu logamulona nīvu gobigalanĕllā
aṁḍane balimiseduvanna suddi
mĕṁḍāya nadivŏ nīmenamāmam̐ jaṁpi
daṁḍimadhura sadulam̐ dagilina suddi

(||nīvu||)
viṁṭimi sīdagum̐gānu vevelugom̐tulam̐ gūḍi
baṁṭadanamuna pāḍuvaḍḍa suddi
kaṁṭimi sigguviḍisi kaḍu burasadulagai
gĕṁṭaga bittalediriginasuddi

(||nīvu||)
nĕgaḍĕ varāhamavai nīmenirom̐ta sūḍaga
pŏgaḍi bhūbadi nīvubŏṁdina suddi
agaḍāya śhrīveṁkaḍādhiba nī viṁdirama
taga mĕḍam̐gaṭṭugŏni daivamaina suddi