Neevu naagem goodidene yeṟumgamu gaaga

నీవు నాకెఁ గూడితెనే యెఱుఁగము గాక
Language

(॥పల్లవి॥)
నీవు నాకెఁ గూడితెనే యెఱుఁగము గాక
యేవల మావశముగా దింతట నీ చిత్తము

(॥నీవు॥)
మాటలాడి నీతో నే మౌనాన వుండితే కాని
కోటికైనా చెలి మాతో గు ట్టియ్యదు
గాట్టపు నిన్నుఁ జూచుటే కన్నులు మూసుటే కాని
తేటల మ మ్మోమక మరి ద్రిష్టింపదు

(॥నీవు॥)
చింత నిన్నుఁ దలఁచుటే చెక్కునఁ జెయ్యే కాని
చెంత మా విన్నపములు చిత్తగించదు
కాంత నీ పానుపునిద్రఁ గలవరించుటే కాని
యెంత మేలుకొలిపినా నెఱుఁగదు

(॥నీవు॥)
చేరి నిన్నుఁ జెనకుట సిగ్గువడుటే కాని
కూరిమి మా బుద్దు లిఁకఁ గొలుపవు
యీరీతి శ్రీవేంకటేశ యింతిఁ గూడితివి నీవు
సారె మీలో బాస మాకు సమ్మతిఁ దెలియదు

(||pallavi||)
nīvu nāgĕm̐ gūḍidĕne yĕṟum̐gamu gāga
yevala māvaśhamugā diṁtaḍa nī sittamu

(||nīvu||)
māḍalāḍi nīdo ne maunāna vuṁḍide kāni
koḍigainā sĕli mādo gu ṭṭiyyadu
gāṭṭabu ninnum̐ jūsuḍe kannulu mūsuḍe kāni
teḍala ma mmomaga mari driṣhṭiṁpadu

(||nīvu||)
siṁta ninnum̐ dalam̐suḍe sĕkkunam̐ jĕyye kāni
sĕṁta mā vinnabamulu sittagiṁchadu
kāṁta nī pānubunidram̐ galavariṁchuḍe kāni
yĕṁta melugŏlibinā nĕṟum̐gadu

(||nīvu||)
seri ninnum̐ jĕnaguḍa sigguvaḍuḍe kāni
kūrimi mā buddu lim̐kam̐ gŏlubavu
yīrīdi śhrīveṁkaḍeśha yiṁtim̐ gūḍidivi nīvu
sārĕ mīlo bāsa māgu sammadim̐ dĕliyadu