Neevu naadam dokkade nemu neevaarame

నీవు నాతఁ డొక్కటె నేము నీవారమె
Language

(॥పల్లవి॥)
నీవు నాతఁ డొక్కటె నేము నీవారమె
వోవరి లోననే వుండి వొడఁబా ట్లేఁటికే

(॥నీవు॥)
మొక్కిన నీ మొక్కు లెల్ల మొదలి పెండ్లివిడేలు
చిక్కని నీనవ్వులె నేసపాలు
తక్కినసుద్దు లేఁటికి తగు లాయఁ బను రెల్ల
యిక్కడి కక్కడి కింక నెడమాట లేఁటికే

(॥నీవు॥)
చూచినచూపులు నీకు చుట్టుపుసమ్మంధాలు
తాచినగంధాక్షతలు తలపోఁతలు
చేచేత మీ కిద్దరికి చేసిన చేఁతలు దక్కె
యేచ యిందరునుఁ జెప్పే యియ్యకో ళ్లేఁటికే

(॥నీవు॥)
కలసినకలయిక కందువసోబనములు
పలుసంతసాలె మీ మీ బాసికాలు
యెలమి శ్రీవెంకటేశు నిటు నీవె కూడితివి
యెలయింపుఁ జెలులచే నెగపోఁత లేఁటికే

(||pallavi||)
nīvu nādam̐ ḍŏkkaḍĕ nemu nīvāramĕ
vovari lonane vuṁḍi vŏḍam̐bā ṭlem̐ṭige

(||nīvu||)
mŏkkina nī mŏkku lĕlla mŏdali pĕṁḍliviḍelu
sikkani nīnavvulĕ nesabālu
takkinasuddu lem̐ṭigi tagu lāyam̐ banu rĕlla
yikkaḍi kakkaḍi kiṁka nĕḍamāḍa lem̐ṭige

(||nīvu||)
sūsinasūbulu nīgu suṭṭubusammaṁdhālu
tāsinagaṁdhākṣhadalu talabom̐talu
seseda mī kiddarigi sesina sem̐talu dakkĕ
yesa yiṁdarunum̐ jĕppe yiyyago ḽlem̐ṭige

(||nīvu||)
kalasinagalayiga kaṁduvasobanamulu
palusaṁtasālĕ mī mī bāsigālu
yĕlami śhrīvĕṁkaḍeśhu niḍu nīvĕ kūḍidivi
yĕlayiṁpum̐ jĕlulase nĕgabom̐ta lem̐ṭige