Neevu mumdu senagagu ninnadamdu senagide

నీవు ముందు చెనకకు నిన్నతఁడు చెనకితే
Language

(॥పల్లవి॥)
నీవు ముందు చెనకకు నిన్నతఁడు చెనకితే
కైవశమై లోలోనే కరఁగుదుగానీ

(॥నీవు॥)
కన్నుల నిన్నుఁ జూచితే గక్కన నవ్వేవుసుమ్మీ
వన్నెగా నందుకుఁ దలవంతువుగానీ
మన్నించి చేయివట్టితే మందెమేళ మొద్దుసుమ్మీ
యిన్నిటాఁ బతిచేఁతకు నియ్యకొందుగానీ

(॥నీవు॥)
దగ్గరఁ బిలిచితేను తమకించేవుసుమ్మీ
వొగ్గి చేతులు వట్టుక వుందువు గానీ
అగ్గలపు సరసాల కవుఁగాదనేవు సుమ్మీ
సిగ్గువడి చెక్కుచేత చింతనుందు గానీ

(॥నీవు॥)
అంది రతిఁ గూడితేను అలఁతఁ బొందేవు సుమ్మీ
చెంది నీవు యిచ్చకమే సేతువుగానీ
విందుగ శ్రీవేంకటాద్రివిభుఁడు గలసె నిన్ను
అందపుఁ జెలితో ముచ్చటాడేవు సుమ్మీ

(||pallavi||)
nīvu muṁdu sĕnagagu ninnadam̐ḍu sĕnagide
kaivaśhamai lolone karam̐gudugānī

(||nīvu||)
kannula ninnum̐ jūside gakkana navvevusummī
vannĕgā naṁdugum̐ dalavaṁtuvugānī
manniṁchi seyivaṭṭide maṁdĕmeḽa mŏddusummī
yinniḍām̐ badisem̐tagu niyyagŏṁdugānī

(||nīvu||)
daggaram̐ bilisidenu tamagiṁchevusummī
vŏggi sedulu vaṭṭuga vuṁduvu gānī
aggalabu sarasāla kavum̐gādanevu summī
sigguvaḍi sĕkkuseda siṁtanuṁdu gānī

(||nīvu||)
aṁdi radim̐ gūḍidenu alam̐tam̐ bŏṁdevu summī
sĕṁdi nīvu yichchagame seduvugānī
viṁduga śhrīveṁkaḍādrivibhum̐ḍu galasĕ ninnu
aṁdabum̐ jĕlido muchchaḍāḍevu summī