Neevu modalu jaanavu neegamte naage jaana

నీవు మొదలు జాణవు నీకంటె నాకె జాణ
Language

(॥పల్లవి॥)
నీవు మొదలు జాణవు నీకంటె నాకె జాణ
ఈవల నావల మిమ్ము నిద్దరి మెచ్చేము

(॥॥)
పయ్యద మాటుసేసుక పలుమారు నవ్వుకొంటా
వుయ్యాలమంచాన నిన్ను నూఁచీఁ జెలి
వొయ్యనె పాదాన నాపెవొడి నీవు దాఁకించఁగ-
నియ్యెడ సిగ్గువడీ నింతలో నీదేవులు

(॥॥)
పుక్కిటివిడెముతోడ పొంచి పొంచి చూచుకొంటా
వొక్కట నాకుమడిచి వొసగీఁ జెలి
చక్కనినీకొనగోరు చనుమొన నంటించఁగా
చెక్కు చేతమోపుకొని సిగ్గువడీ దేవులు

(॥॥)
తనివోనిగుట్టుతోడ తమకము రేఁచుకొంటా
యెనసి కాఁగిట మోవి యిచ్చీఁ జెలి
ఘనుఁడ శ్రీ వేంకటేశ కళలుమించఁ గూడఁగ
చెనకేచెలులఁ జూచి సిగ్గువడీదేవులు

(||pallavi||)
nīvu mŏdalu jāṇavu nīgaṁṭĕ nāgĕ jāṇa
īvala nāvala mimmu niddari mĕchchemu

(||||)
payyada māḍusesuga palumāru navvugŏṁṭā
vuyyālamaṁchāna ninnu nūm̐sīm̐ jĕli
vŏyyanĕ pādāna nābĕvŏḍi nīvu dām̐kiṁcham̐ga-
niyyĕḍa sigguvaḍī niṁtalo nīdevulu

(||||)
pukkiḍiviḍĕmudoḍa pŏṁchi pŏṁchi sūsugŏṁṭā
vŏkkaḍa nāgumaḍisi vŏsagīm̐ jĕli
sakkaninīgŏnagoru sanumŏna naṁṭiṁcham̐gā
sĕkku sedamobugŏni sigguvaḍī devulu

(||||)
tanivoniguṭṭudoḍa tamagamu rem̐sugŏṁṭā
yĕnasi kām̐giḍa movi yichchīm̐ jĕli
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kaḽalumiṁcham̐ gūḍam̐ga
sĕnagesĕlulam̐ jūsi sigguvaḍīdevulu