Neevu mannimchamgaa ne nimtayidim gaaga

నీవు మన్నించఁగా నే నింతయితిఁ గాక
Language

(॥పల్లవి॥)
నీవు మన్నించఁగా నే నింతయితిఁ గాక
కావరించి నీతో నవ్వఁగలనా నేను

(॥నీవు॥)
ఘనుఁడ విడె మియ్యఁగా కాదనరాదు గాని
చెనికి నీసొమ్ము లంటఁ జెల్లునా నాకు
చనవిచ్చి మాటాడఁగాఁ జాలుననరాదు గాని
తనర నీతో నేకతాలదాననా

(॥నీవు॥)
వరుస నీవు రాఁగా వద్దనఁగారాదు గాని
తర మెఱిఁగి రప్పించఁదగునా నాకు
వొరసి చేయి వేయఁగా నోపననరాదు గాని
సరి నింతదీమసపుసతినా నేను

(॥నీవు॥)
నీవు కాఁగిటఁ గూడఁగా నేమానరాదు గాని
యీవేళ మఁదెమేళా లెమ్మెలా నాకు
శ్రీవేంకటేశ నీవు సేసినట్టే సేతుగాని
చేవదేర మెచ్చి సంతసించకుండగలనా

(||pallavi||)
nīvu manniṁcham̐gā ne niṁtayidim̐ gāga
kāvariṁchi nīdo navvam̐galanā nenu

(||nīvu||)
ghanum̐ḍa viḍĕ miyyam̐gā kādanarādu gāni
sĕnigi nīsŏmmu laṁṭam̐ jĕllunā nāgu
sanavichchi māḍāḍam̐gām̐ jālunanarādu gāni
tanara nīdo negadāladānanā

(||nīvu||)
varusa nīvu rām̐gā vaddanam̐gārādu gāni
tara mĕṟim̐gi rappiṁcham̐dagunā nāgu
vŏrasi seyi veyam̐gā nobananarādu gāni
sari niṁtadīmasabusadinā nenu

(||nīvu||)
nīvu kām̐giḍam̐ gūḍam̐gā nemānarādu gāni
yīveḽa mam̐dĕmeḽā lĕmmĕlā nāgu
śhrīveṁkaḍeśha nīvu sesinaṭṭe sedugāni
sevadera mĕchchi saṁtasiṁchaguṁḍagalanā