నీవు మంచివాఁడవే నిన్ను నాడఁ జోటు లేదు
(॥పల్లవి॥)
నీవు మంచివాఁడవే నిన్ను నాడఁ జోటు లేదు
వావిరి నీవద్దివారి వాస నంటఁబోలును
(॥నీవు॥)
నీకంటే ముందర లేచి నీమోము చూచితిని
వాకుదోసాలు నేఁటికి వాదు వచ్చెనో
ఆకడ నీ వెవ్వతెమో మటు చూచితివో దానిఁ
కాసరిగుణము ఇందుగలయఁగఁబోలును
(॥నీవు॥)
మంచివేళగాఁ జూచి మరి నీతో మాటాడితి
ఇంచుక నీ కిది వెంగె మే లాయనో
వంచి నీవద్ది కెవ్వతె వచ్చినభాగ్యమో దానిఁ
చంచలపుఁదన మిందు సరి చూపఁబోలును
(॥నీవు॥)
పొంతనా లిద్దరికిని పొఁగఁ జూచి కూడితిఁ
నింతట శ్రీవేంకటేశ యేమ నుంటివో
పొంతల నెవ్వతె నీకీబుద్దులు చెప్పినో దాని
అంతటానేరపులు నిన్నంటుకొనఁబోలును
(||pallavi||)
nīvu maṁchivām̐ḍave ninnu nāḍam̐ joḍu ledu
vāviri nīvaddivāri vāsa naṁṭam̐bolunu
(||nīvu||)
nīgaṁṭe muṁdara lesi nīmomu sūsidini
vāgudosālu nem̐ṭigi vādu vachchĕno
āgaḍa nī vĕvvadĕmo maḍu sūsidivo dānim̐
kāsariguṇamu iṁdugalayam̐gam̐bolunu
(||nīvu||)
maṁchiveḽagām̐ jūsi mari nīdo māḍāḍidi
iṁchuga nī kidi vĕṁgĕ me lāyano
vaṁchi nīvaddi kĕvvadĕ vachchinabhāgyamo dānim̐
saṁchalabum̐dana miṁdu sari sūbam̐bolunu
(||nīvu||)
pŏṁtanā liddarigini pŏm̐gam̐ jūsi kūḍidim̐
niṁtaḍa śhrīveṁkaḍeśha yema nuṁṭivo
pŏṁtala nĕvvadĕ nīgībuddulu sĕppino dāni
aṁtaḍānerabulu ninnaṁṭugŏnam̐bolunu