Neevu mamchivaamdave nee semtale nannu

నీవు మంచివాఁడవే నీ చేఁతలే నన్ను
Language

(॥పల్లవి॥)
నీవు మంచివాఁడవే నీ చేఁతలే నన్ను
చేవ ముంటి(ముట్టి?) పోటులై చిమ్మి రేఁచీఁగాని

(॥॥)
కన్నులు నీవి మంచివి కడలఁ గెంపులు నిండి
యెన్నఁగఁ గోపమురేఁచె నిదే కానిది
అన్నిటా నీమాట లెస్స అందులోనే దగదొట్టి
విన్నని నీయలపులే వెతరేఁచీఁ గాని

(॥॥)
ముంగిటినవ్వు మంచిది మోవిని పొక్కులు నాకు
చెంగటఁ జిగురుచేఁదులే చేసీఁగాని
అంగడిఁ జక్కనివాఁడ వౌదువు నీమేనిమీఁది-
వుంగిటివింతవాసన లుడికించీఁగాని

(॥॥)
అతిరతినీయధరామృతము తియ్యనే
సతులెల్లాఁ జవిగొంటేఁ జప్పన గాని
ఇతవుగా శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
కతలుగావా నిన్నుఁ గై కొంటిఁ గాని

(||pallavi||)
nīvu maṁchivām̐ḍave nī sem̐tale nannu
seva muṁṭi(muṭṭi?) poḍulai simmi rem̐sīm̐gāni

(||||)
kannulu nīvi maṁchivi kaḍalam̐ gĕṁpulu niṁḍi
yĕnnam̐gam̐ gobamurem̐sĕ nide kānidi
anniḍā nīmāḍa lĕssa aṁdulone dagadŏṭṭi
vinnani nīyalabule vĕdarem̐sīm̐ gāni

(||||)
muṁgiḍinavvu maṁchidi movini pŏkkulu nāgu
sĕṁgaḍam̐ jigurusem̐dule sesīm̐gāni
aṁgaḍim̐ jakkanivām̐ḍa vauduvu nīmenimīm̐di-
vuṁgiḍiviṁtavāsana luḍigiṁchīm̐gāni

(||||)
adiradinīyadharāmṛtamu tiyyane
sadulĕllām̐ javigŏṁṭem̐ jappana gāni
idavugā śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
kadalugāvā ninnum̐ gai kŏṁṭim̐ gāni