Neevu mamchivaamdave ne nettumdidi nemi

నీవు మంచివాఁడవె నే నెట్టుండితి నేమి
Language

(॥పల్లవి॥)
నీవు మంచివాఁడవె నే నెట్టుండితి నేమి
యీ విధము లెరఁగక యెడ్డదాన నైతిని

(॥నీవు॥)
నిండిన నీతలపోఁత నే నెరఁగఁగా నావద్ద
నుండఁగా నావాఁడ వని వుంటిఁ గాని
యెండమావులనీళ్లు యేరు లంటా నుండి నట్టు
కొండవంటి యాసచేత కూళదాన నైతిని

(॥నీవు॥)
పంతాలు నే నెరఁగఁగా పలుకక నీ వుండఁగ
అంతలో నా కెదురాడ మాని వుంటిని
బంతినె తెల్లని వెల్లఁ బాలంటా చవి గొన్నట్టు
రంతులబాసలు నమ్మి రాఁపుదాన నైతిని

(॥నీవు॥)
నీ మోహము లెరఁగఁగా నిక్కము నాకు మొక్కఁగ
అముకొని యెగసక్యా లని వుంటివి
చేముంచి శ్రీవెంకటేశ చెఱకున పండున్నట్టు
కామించి నీవుర మెక్కి ఘనురాల నైతిని

(||pallavi||)
nīvu maṁchivām̐ḍavĕ ne nĕṭṭuṁḍidi nemi
yī vidhamu lĕram̐gaga yĕḍḍadāna naidini

(||nīvu||)
niṁḍina nīdalabom̐ta ne nĕram̐gam̐gā nāvadda
nuṁḍam̐gā nāvām̐ḍa vani vuṁṭim̐ gāni
yĕṁḍamāvulanīḽlu yeru laṁṭā nuṁḍi naṭṭu
kŏṁḍavaṁṭi yāsaseda kūḽadāna naidini

(||nīvu||)
paṁtālu ne nĕram̐gam̐gā palugaga nī vuṁḍam̐ga
aṁtalo nā kĕdurāḍa māni vuṁṭini
baṁtinĕ tĕllani vĕllam̐ bālaṁṭā savi gŏnnaṭṭu
raṁtulabāsalu nammi rām̐pudāna naidini

(||nīvu||)
nī mohamu lĕram̐gam̐gā nikkamu nāgu mŏkkam̐ga
amugŏni yĕgasakyā lani vuṁṭivi
semuṁchi śhrīvĕṁkaḍeśha sĕṟaguna paṁḍunnaṭṭu
kāmiṁchi nīvura mĕkki ghanurāla naidini