Neevu magavaamdavu nelamta yaabe

నీవు మగవాఁడవు నెలఁత యాపె
Language

(॥పల్లవి॥)
నీవు మగవాఁడవు నెలఁత యాపె
వేవేలకు నైనాను వింత సేయఁ జెల్లునా

(॥నీవు॥)
తచ్చి తచ్చి యాపెతో తారుకాణ నీకు నేల
యిచ్చగించి విన రాదా యింతలో నేమి
హెచ్చినకోపానఁ జెలి యే మన్నా ననెఁ గాక
మచ్చరించ యింత నీకు మారుమాట చెల్లునా

(॥నీవు॥)
ముంచి తిట్టెయాపెఁ జూచి మోవినె నవ్వఁగ నేల
యించుక వోరుచ రాదా యింతలో నేమి
మించలవనిత యెంత మీరినామ మీరెఁ గాక
అంచెల సతులతో నా కాడుకొనఁ జెల్లునా

(॥నీవు॥)
కూడినవేళ యాపెతో గోరఁ జెనకఁగ నేల
యీడ జోడై యుండ రాదా యింతలో నేమి
వేడుక శ్రీవెంకటేశ వెలఁదిఁ గలసితివి
తోడనె తనివి లే దొమ్మి సేయఁ జెల్లునా

(||pallavi||)
nīvu magavām̐ḍavu nĕlam̐ta yābĕ
vevelagu nainānu viṁta seyam̐ jĕllunā

(||nīvu||)
tachchi tachchi yābĕdo tārugāṇa nīgu nela
yichchagiṁchi vina rādā yiṁtalo nemi
hĕchchinagobānam̐ jĕli ye mannā nanĕm̐ gāga
machchariṁcha yiṁta nīgu mārumāḍa sĕllunā

(||nīvu||)
muṁchi tiṭṭĕyābĕm̐ jūsi movinĕ navvam̐ga nela
yiṁchuga vorusa rādā yiṁtalo nemi
miṁchalavanida yĕṁta mīrināma mīrĕm̐ gāga
aṁchĕla sadulado nā kāḍugŏnam̐ jĕllunā

(||nīvu||)
kūḍinaveḽa yābĕdo goram̐ jĕnagam̐ga nela
yīḍa joḍai yuṁḍa rādā yiṁtalo nemi
veḍuga śhrīvĕṁkaḍeśha vĕlam̐dim̐ galasidivi
toḍanĕ tanivi le dŏmmi seyam̐ jĕllunā