Neevu magavaamdavu nee vettumdinaam jellu

నీవు మగవాఁడవు నీ వెట్టుండినాఁ జెల్లు
Language

(॥పల్లవి॥)
నీవు మగవాఁడవు నీ వెట్టుండినాఁ జెల్లు
భావించి ఆఁటదానను పదరక వుందును

(॥నీవు॥)
మనలో నాడినమాట మగువలెట్టెఱిఁగిరి
పెనుపొంద నీవే చెప్పితివి గాక
యెనలేక యిటువంటి యెమ్మెకాఁడవంటానే కా
వొనరి నే మోనముతో నూరకే వుండుదును

(॥నీవు॥)
పయ్యదలో గురుతులు పడఁతులెట్టెఱిఁగిరి
కొయ్యవై నీవే యాడుకొంటివి గాక
యెయ్యెడ బగ్గడివాఁడవిటు నీవంటానే కా
కుయ్యక తెరమాటున గుట్టుసేసుకుందును

(॥నీవు॥)
వొంటిఁ గాఁగిటిలో రతులువిదలెట్టెఱిఁగిరి
నంటున మచ్చికను నీ వంటివి గాక
ఇంటిలో శ్రీవేంకటేశ ఇట్టివాఁడవంటానే కా
జంటయై యే పొద్దు నీ సంగడినే వుందును

(||pallavi||)
nīvu magavām̐ḍavu nī vĕṭṭuṁḍinām̐ jĕllu
bhāviṁchi ām̐ṭadānanu padaraga vuṁdunu

(||nīvu||)
manalo nāḍinamāḍa maguvalĕṭṭĕṟim̐giri
pĕnubŏṁda nīve sĕppidivi gāga
yĕnalega yiḍuvaṁṭi yĕmmĕgām̐ḍavaṁṭāne kā
vŏnari ne monamudo nūrage vuṁḍudunu

(||nīvu||)
payyadalo gurudulu paḍam̐tulĕṭṭĕṟim̐giri
kŏyyavai nīve yāḍugŏṁṭivi gāga
yĕyyĕḍa baggaḍivām̐ḍaviḍu nīvaṁṭāne kā
kuyyaga tĕramāḍuna guṭṭusesuguṁdunu

(||nīvu||)
vŏṁṭim̐ gām̐giḍilo raduluvidalĕṭṭĕṟim̐giri
naṁṭuna machchiganu nī vaṁṭivi gāga
iṁṭilo śhrīveṁkaḍeśha iṭṭivām̐ḍavaṁṭāne kā
jaṁṭayai ye pŏddu nī saṁgaḍine vuṁdunu