Neevu maagu burigaaga neramu limdemunnadi

నీవు మాకు బురిగాక నేరము లిందేమున్నది
Language

(॥పల్లవి॥)
నీవు మాకు బురిగాక నేరము లిందేమున్నది
ఆవటించి మనసులో నౌఁగాము లున్నవా

(॥నీవు॥)
శ్రీ పతివైన నీవు చేపట్టి నన్నేలితివి
యేపనులు చెప్పినాను యేమాయను
వోపి నీకు మొదలనే వూడిగపువారమట
యేపొద్దు చూచిన మాకు నెగ్గుపట్టనున్నదా

(॥నీవు॥)
దేవుఁడవైన నీవు తేనెమోవి ఇచ్చితివి
భావించి నీవేమనినా పంగెమున్నదా
చేవమీరి నీకు నేను చేతిలోని దాననట
కావరించి నీతో మాకు కాఁతాళించనున్నదా

(॥నీవు॥)
గక్కన శ్రీ వేంకటేశ కాఁగిలించి కూడితివి
యెక్కుడు నిన్నుఁ గొసర నేమున్నది
చిక్కని నవ్వుల తోడి సేసపాలదాననట
పక్కన నేఁ డిఁక నీతో పంతమాడనున్నదా

(||pallavi||)
nīvu māgu burigāga neramu liṁdemunnadi
āvaḍiṁchi manasulo naum̐gāmu lunnavā

(||nīvu||)
śhrī padivaina nīvu sebaṭṭi nannelidivi
yebanulu sĕppinānu yemāyanu
vobi nīgu mŏdalane vūḍigabuvāramaḍa
yebŏddu sūsina māgu nĕggubaṭṭanunnadā

(||nīvu||)
devum̐ḍavaina nīvu tenĕmovi ichchidivi
bhāviṁchi nīvemaninā paṁgĕmunnadā
sevamīri nīgu nenu sediloni dānanaḍa
kāvariṁchi nīdo māgu kām̐tāḽiṁchanunnadā

(||nīvu||)
gakkana śhrī veṁkaḍeśha kām̐giliṁchi kūḍidivi
yĕkkuḍu ninnum̐ gŏsara nemunnadi
sikkani navvula toḍi sesabāladānanaḍa
pakkana nem̐ ḍim̐ka nīdo paṁtamāḍanunnadā