నీవు లోకోన్నతుఁడవు నిన్నెఱుఁగరా యిందరు
(॥పల్లవి॥)
నీవు లోకోన్నతుఁడవు నిన్నెఱుఁగరా యిందరు
వేవేలు నేఁ గెలసిన వెలితా నీకు
(॥నీవు॥)
గుట్టునఁ బుట్టుతా బొడ్డు గోయించుకొన్నవాఁడు
యిట్టే జారుఁడవంటే యెగ్గా నీకు
బట్టబయలు సంసార భ్రమ వట్టి
వొట్టి నాటకుఁడ వంటే వొచ్చెమా నీకు
(॥నీవు॥)
అంది యధరపానాన అన్ను వట్టినట్టి వాఁడ
చెందిన కపటి వంటే సిగ్గా నీకు
ముందే మాయాశక్తి శివమునఁ బొరలేవాఁడ
నిందఁ బడ్డవాఁడ వంటే నేరమా నీకు
(॥నీవు॥)
పలుకులప్రల్లదపు బహుభాషివాఁడను
యిల వెన్నదొంగ వంటే హీనమా నీకు
అలరి శ్రీవేంకటేశ అన్నిటా నీ దాసుఁడను
బలుదైత్య హంత వంటే భారమా నీకు
(||pallavi||)
nīvu logonnadum̐ḍavu ninnĕṟum̐garā yiṁdaru
vevelu nem̐ gĕlasina vĕlidā nīgu
(||nīvu||)
guṭṭunam̐ buṭṭudā bŏḍḍu goyiṁchugŏnnavām̐ḍu
yiṭṭe jārum̐ḍavaṁṭe yĕggā nīgu
baṭṭabayalu saṁsāra bhrama vaṭṭi
vŏṭṭi nāḍagum̐ḍa vaṁṭe vŏchchĕmā nīgu
(||nīvu||)
aṁdi yadharabānāna annu vaṭṭinaṭṭi vām̐ḍa
sĕṁdina kabaḍi vaṁṭe siggā nīgu
muṁde māyāśhakti śhivamunam̐ bŏralevām̐ḍa
niṁdam̐ baḍḍavām̐ḍa vaṁṭe neramā nīgu
(||nīvu||)
palugulapralladabu bahubhāṣhivām̐ḍanu
yila vĕnnadŏṁga vaṁṭe hīnamā nīgu
alari śhrīveṁkaḍeśha anniḍā nī dāsum̐ḍanu
baludaitya haṁta vaṁṭe bhāramā nīgu