Neevu lakshmeebadivi ninnu namminavaarigi

నీవు లక్ష్మీపతివి నిన్ను నమ్మినవారికి
Language

(॥పల్లవి॥)
నీవు లక్ష్మీపతివి నిన్ను నమ్మినవారికి
యేవల నిహపరము లిచ్చు టేమరుదు

(॥నీవు॥)
శునక మొకటి ధర్మజునివెంటఁ దిరిగితేఁ
దన పుణ్యగతి యిచ్చె దాని కందురు
మనికి నేకలవ్యుఁడు మంటిబొమ్మఁ గొలిచితే
నెనలేని విలువిద్య విన్ని నిచ్చె నందురు

(॥నీవు॥)
శరనిధికి విప్రుఁ డక్షతలు నిత్య మిడితే
సరిలేని మాణిక మొసగె నందురు
ధరఁ బామున కొకఁడు తాఁ బంచాంగము చెప్పితే
దరిద్ర మణఁగను రత్నము నిచ్చె నందురు

(॥నీవు॥)
చెచ్చెరను వొక గువ్వ శిబిమఱఁగు చొచ్చితే
కచ్చుపెట్టి యంతలోనే కాచి నందురు
యిచ్చల శ్రీవేంకటేశ యిట్టే విభీషణుఁడు
మచ్చిక నీ శరణంటే మన్నించితి వందురు

(||pallavi||)
nīvu lakṣhmībadivi ninnu namminavārigi
yevala nihabaramu lichchu ṭemarudu

(||nīvu||)
śhunaga mŏgaḍi dharmajunivĕṁṭam̐ dirigidem̐
dana puṇyagadi yichchĕ dāni kaṁduru
manigi negalavyum̐ḍu maṁṭibŏmmam̐ gŏliside
nĕnaleni viluvidya vinni nichchĕ naṁduru

(||nīvu||)
śharanidhigi viprum̐ ḍakṣhadalu nitya miḍide
sarileni māṇiga mŏsagĕ naṁduru
dharam̐ bāmuna kŏgam̐ḍu tām̐ baṁchāṁgamu sĕppide
daridra maṇam̐ganu ratnamu nichchĕ naṁduru

(||nīvu||)
sĕchchĕranu vŏga guvva śhibimaṟam̐gu sŏchchide
kachchubĕṭṭi yaṁtalone kāsi naṁduru
yichchala śhrīveṁkaḍeśha yiṭṭe vibhīṣhaṇum̐ḍu
machchiga nī śharaṇaṁṭe manniṁchidi vaṁduru