నీవు గోవిందరాజవు నెరజాణవు
(॥పల్లవి॥)
నీవు గోవిందరాజవు నెరజాణవు
మోవులు చూపి వారు మోహము చల్లేరు
(॥నీవు॥)
కొలువులోపల నిన్నుఁ గొసరి కొసరిచూచి
చెలు లిద్దరును నిన్నుఁ జెనకేరు
వలపులు మక్కళించి వన్నెదే రేనీ మోమున
కళలు రేఁచి రేఁచి కమ్మటి నవ్వేరు
(॥నీవు॥)
పానుపుమీఁదట నీకుఁ బాదము లొత్తియొత్తి
మానిను లిద్దరు నీతో మాటాడేరు
పూని యాసలు రెట్టించి పొత్తుల నీమేనెల్లా
మైనమువలఁ బెనఁగి మచ్చిక రేఁచేరు
(॥నీవు॥)
వోవరిలోపల నుండి వొడివట్టి నిననుఁ దీసి
శ్రీవనితా భూవనితాఁ జె(జం?) ది కూడేరు
యీవలనావలా మొక్కి శ్రీవేంకటపతివైన
గోవిందరాజ నీగుణము మెచ్చేరు
(||pallavi||)
nīvu goviṁdarājavu nĕrajāṇavu
movulu sūbi vāru mohamu salleru
(||nīvu||)
kŏluvulobala ninnum̐ gŏsari kŏsarisūsi
sĕlu liddarunu ninnum̐ jĕnageru
valabulu makkaḽiṁchi vannĕde renī momuna
kaḽalu rem̐si rem̐si kammaḍi navveru
(||nīvu||)
pānubumīm̐daḍa nīgum̐ bādamu lŏttiyŏtti
māninu liddaru nīdo māḍāḍeru
pūni yāsalu rĕṭṭiṁchi pŏttula nīmenĕllā
mainamuvalam̐ bĕnam̐gi machchiga rem̐seru
(||nīvu||)
vovarilobala nuṁḍi vŏḍivaṭṭi ninanum̐ dīsi
śhrīvanidā bhūvanidām̐ jĕ(jaṁ?) di kūḍeru
yīvalanāvalā mŏkki śhrīveṁkaḍabadivaina
goviṁdarāja nīguṇamu mĕchcheru