నీవు గోరినట్టే యాయ నేఁ డాపెవలన నీకు
(॥పల్లవి॥)
నీవు గోరినట్టే యాయ నేఁ డాపెవలన నీకు
చేవదేరి వలపులు చిమ్మి రేఁగెనా
(॥నీవు॥)
వలపలడాపలాను వడిగాఁ గొసరె నిన్ను
చెలియవిన్నపములు చెవి సోఁకెనా
కలికితనములెల్లా కన్నుల నీపై నించె
సొలపుఁజూపులు నీలో సూటిఁ బారెనా
(॥నీవు॥)
మొగము విచ్చివిచ్చి ముందుకలుగనె నవ్వె
మగువసరసములు మతిఁ బట్టెనా
చిగురుమోవితేనెచిప్పిల విందులు వెటె
తగిలినీవేడుకలు తనివొందెనా
(॥నీవు॥)
కప్పురబాగాలు నీకు గక్కనఁ జేతి కందిచ్చె
చెప్పరానికానికానికలు చేకూరెనా
ఇప్పుడు శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
అప్పణ గలిగెనా ఆపె వేఁడుకొంటివా
(||pallavi||)
nīvu gorinaṭṭe yāya nem̐ ḍābĕvalana nīgu
sevaderi valabulu simmi rem̐gĕnā
(||nīvu||)
valabalaḍābalānu vaḍigām̐ gŏsarĕ ninnu
sĕliyavinnabamulu sĕvi som̐kĕnā
kaligidanamulĕllā kannula nībai niṁchĕ
sŏlabum̐jūbulu nīlo sūḍim̐ bārĕnā
(||nīvu||)
mŏgamu vichchivichchi muṁdugaluganĕ navvĕ
maguvasarasamulu madim̐ baṭṭĕnā
sigurumovidenĕsippila viṁdulu vĕḍĕ
tagilinīveḍugalu tanivŏṁdĕnā
(||nīvu||)
kappurabāgālu nīgu gakkanam̐ jedi kaṁdichchĕ
sĕpparānigānigānigalu segūrĕnā
ippuḍu śhrīveṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
appaṇa galigĕnā ābĕ vem̐ḍugŏṁṭivā