నీవు గడించినమేలు నీవే యెఱుఁగవలె
(॥పల్లవి॥)
నీవు గడించినమేలు నీవే యెఱుఁగవలె
సోవల నదే దిష్టము చూచుకొనవయ్యా
(॥నీవు॥)
అలమేలుమంగ మేనియౌవనరాజ్యమున
మొలకలపులకలు మొలచెను
బలిమితో వలపులపంటలునుఁ బండె నిదె
కలలెక్కలు విందువు గక్కన రావయ్యా
(॥నీవు॥)
లంకెలై యీకామినిలావణ్యజలధిలోన
వుంకువ కోరికలు వోడల వచ్చెను
సంకెలేక తమకపుసరకులుపచారించె
సుంకపుటాదాయము లెంచుకొనఁగదయ్యా
(॥నీవు॥)
రచనల నీకెసింగారములతోఁటలోన
కుచముల బంగారు కొప్పెర లుండె
వుచితాన శ్రీవేంకటోత్తముఁడ నిన్నుఁ గూడె
ఇచటనే దాఁచుకొని యిట్టె బదుకవయ్యా
(||pallavi||)
nīvu gaḍiṁchinamelu nīve yĕṟum̐gavalĕ
sovala nade diṣhṭamu sūsugŏnavayyā
(||nīvu||)
alamelumaṁga meniyauvanarājyamuna
mŏlagalabulagalu mŏlasĕnu
balimido valabulabaṁṭalunum̐ baṁḍĕ nidĕ
kalalĕkkalu viṁduvu gakkana rāvayyā
(||nīvu||)
laṁkĕlai yīgāminilāvaṇyajaladhilona
vuṁkuva korigalu voḍala vachchĕnu
saṁkĕlega tamagabusaragulubasāriṁchĕ
suṁkabuḍādāyamu lĕṁchugŏnam̐gadayyā
(||nīvu||)
rasanala nīgĕsiṁgāramuladom̐ṭalona
kusamula baṁgāru kŏppĕra luṁḍĕ
vusidāna śhrīveṁkaḍottamum̐ḍa ninnum̐ gūḍĕ
isaḍane dām̐sugŏni yiṭṭĕ badugavayyā