Neevoom boyi vedagaraa nilusumdanela yeeda

నీవూఁ బోయి వెదకరా నిలుచుండనేల యీడ
Language

(॥పల్లవి॥)
నీవూఁ బోయి వెదకరా నిలుచుండనేల యీడ
తేవల నామాట గల్లైతే మఱి రారా

(॥॥)
చెప్పేరా నీకొకసుద్ది చెవులపండుగఁగాను
ఇప్పుడొకతె వెదకె నిందాఁకా నిన్ను
వొప్పగు దోమతెరలో నున్నదో కాక నీ-
చప్పరమాళిగెలోన సరి నొంటి నున్నదో

(॥॥)
ఇచ్చెరా నీకొక మేలు ఇదివో వొకతె వచ్చి
గచ్చుల నీపేరఁ గమ్మ గట్టిపోయను
మెచ్చలనీమాణికాల మేడపై నెక్కున్నదో
ముచ్చటసింగారవనములోన నున్నదో

(॥॥)
అంటెరా పాదములు ఆకె నీవురముమీఁద
సొంటులు సోదించ వచ్చి చొచ్చేంటాను
నంటు సేసి యప్పటివి నన్నుఁ గూడితివి నేఁడు
దంటవు శ్రీ వేంకటేశ తా నిన్ను నేమన్నదో

(||pallavi||)
nīvūm̐ boyi vĕdagarā nilusuṁḍanela yīḍa
tevala nāmāḍa gallaide maṟi rārā

(||||)
sĕpperā nīgŏgasuddi sĕvulabaṁḍugam̐gānu
ippuḍŏgadĕ vĕdagĕ niṁdām̐kā ninnu
vŏppagu domadĕralo nunnado kāga nī-
sapparamāḽigĕlona sari nŏṁṭi nunnado

(||||)
ichchĕrā nīgŏga melu idivo vŏgadĕ vachchi
gachchula nīberam̐ gamma gaṭṭiboyanu
mĕchchalanīmāṇigāla meḍabai nĕkkunnado
muchchaḍasiṁgāravanamulona nunnado

(||||)
aṁṭĕrā pādamulu āgĕ nīvuramumīm̐da
sŏṁṭulu sodiṁcha vachchi sŏchcheṁṭānu
naṁṭu sesi yappaḍivi nannum̐ gūḍidivi nem̐ḍu
daṁṭavu śhrī veṁkaḍeśha tā ninnu nemannado