Neevoo neeyamtane nenoo naayamtane

నీవూ నీయంతనే నేనూ నాయంతనే
Language

(॥పల్లవి॥)
నీవూ నీయంతనే నేనూ నాయంతనే
కావలసినట్లయ్యీఁ గడమ లింకేలా

(॥నీవూ॥)
దవ్వులఁ జూచితివి తనివిఁబొందితి నేను
నవ్వు నవ్వితివి నీవు నమ్మితి నేను
పువ్వుల వేసితివి పులకించితి నేను
రవ్వగా నింకానేల రతికిఁ దీసేవు

(॥నీవూ॥)
కన్నుల మొక్కితివి కరఁగి కై కొంటి నేను
సన్నలు సేసితివి సమ్మతించితి
కిన్నెర మీఁటితివి కిమ్ముఁల జొక్కొతి నేను
పన్ని యింకానేల నీవు పైకొని పిలిచేవు

(॥నీవూ॥)
మోవి నీవు చూపితివి మోహము చేకొంటి నేను
వావి నీవు చెప్పితివి వలచితిని
తావుల శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
తోవల నింకానేల దొమ్ములు సేసేవు

(||pallavi||)
nīvū nīyaṁtane nenū nāyaṁtane
kāvalasinaṭlayyīm̐ gaḍama liṁkelā

(||nīvū||)
davvulam̐ jūsidivi tanivim̐bŏṁdidi nenu
navvu navvidivi nīvu nammidi nenu
puvvula vesidivi pulagiṁchidi nenu
ravvagā niṁkānela radigim̐ dīsevu

(||nīvū||)
kannula mŏkkidivi karam̐gi kai kŏṁṭi nenu
sannalu sesidivi sammadiṁchidi
kinnĕra mīm̐ṭidivi kimmum̐la jŏkkŏdi nenu
panni yiṁkānela nīvu paigŏni pilisevu

(||nīvū||)
movi nīvu sūbidivi mohamu segŏṁṭi nenu
vāvi nīvu sĕppidivi valasidini
tāvula śhrīveṁkaḍeśha taga nannum̐ gūḍidivi
tovala niṁkānela dŏmmulu sesevu