(॥పల్లవి॥)
నీవిట్లుండుట నే నెఱగా
ఆవల నీయింటి కంపితి నేను
(॥నీవి॥)
పిలుచుక రమ్మని ప్రియము చెప్పుమని
నెలతల నంపితి నీకడకు
యెలమి నీకు వా రెదెరు గారయిరి
వెలి నీవెందుండి విచ్చేసితివో
(॥నీవి॥)
కానుక లిమ్మని కదిసి మొక్కుమని
పూని యంపితిని పొలతులను
నీనెల వెఱగక నెమరికో తాము
తోనే చీకటి పొద్దున వచ్చితివి
(॥నీవి॥)
వరుస లడుగుమని వలపు దెలుపుమని
తరుణుల నంపితి తమకమున
పరగ శ్రీవేంకటాద్రి పతి ననుఁ గూడితి
తిరిగిరి వారే తిరమైతి నీవు
(||pallavi||)
nīviṭluṁḍuḍa ne nĕṟagā
āvala nīyiṁṭi kaṁpidi nenu
(||nīvi||)
pilusuga rammani priyamu sĕppumani
nĕladala naṁpidi nīgaḍagu
yĕlami nīgu vā rĕdĕru gārayiri
vĕli nīvĕṁduṁḍi vichchesidivo
(||nīvi||)
kānuga limmani kadisi mŏkkumani
pūni yaṁpidini pŏladulanu
nīnĕla vĕṟagaga nĕmarigo tāmu
tone sīgaḍi pŏdduna vachchidivi
(||nīvi||)
varusa laḍugumani valabu dĕlubumani
taruṇula naṁpidi tamagamuna
paraga śhrīveṁkaḍādri padi nanum̐ gūḍidi
tirigiri vāre tiramaidi nīvu