Neevinnidaa jaanavauda neneramganaa

నీవిన్నిటా జాణవౌత నేనెరఁగనా
Language

(॥పల్లవి॥)
నీవిన్నిటా జాణవౌత నేనెరఁగనా
వేవేలు నా తమకాన విన్నవించేఁగాక

(॥నీవి॥)
ముందు నన్ను మన్నించి వెహించు టెరఁగనా
అందరు నెరఁగవలెనని కాక
కందువ నీవు నాపైనే కన్నులౌతెరఁగనా
సందడి నున్నదాననై చవిరేఁచేఁగాక

(॥నీవి॥)
చనవు నాకిచ్చినట్టి సరవు లెరఁగనా
ననుపు మెరసి కొంత నవ్వేఁగాక
మనలోన నాడుకన్నమంతన లెరఁగనా
తనివి చాలక నేనే తత్తరించేఁగాక

(॥నీవి॥)
కొంకు లేక నీవు నన్నుఁగూడేదెరఁగనా
పొంకపు నీదయ నాపైఁబుట్టించేఁ గాక
అంకెల శ్రీవేంకటేశ అట్టె నన్నుఁగూడితివి
లంకెలౌతెరఁగనా నీలాగు చూచేఁ గాక

(||pallavi||)
nīvinniḍā jāṇavauda nenĕram̐ganā
vevelu nā tamagāna vinnaviṁchem̐gāga

(||nīvi||)
muṁdu nannu manniṁchi vĕhiṁchu ṭĕram̐ganā
aṁdaru nĕram̐gavalĕnani kāga
kaṁduva nīvu nābaine kannulaudĕram̐ganā
saṁdaḍi nunnadānanai savirem̐sem̐gāga

(||nīvi||)
sanavu nāgichchinaṭṭi saravu lĕram̐ganā
nanubu mĕrasi kŏṁta navvem̐gāga
manalona nāḍugannamaṁtana lĕram̐ganā
tanivi sālaga nene tattariṁchem̐gāga

(||nīvi||)
kŏṁku lega nīvu nannum̐gūḍedĕram̐ganā
pŏṁkabu nīdaya nābaim̐buṭṭiṁchem̐ gāga
aṁkĕla śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐gūḍidivi
laṁkĕlaudĕram̐ganā nīlāgu sūsem̐ gāga