Neevichchina sanavellaa nerabeem daanu

నీవిచ్చిన చనవెల్లా నెరపీఁ దాను
Language

(॥పల్లవి॥)
నీవిచ్చిన చనవెల్లా నెరపీఁ దాను
యీవలఁ దన యాసోద మింకా నెంతగలదో

(॥నీవి॥)
కొసరికొసరి నిన్నుఁ గొమ్మ నీతో మాటలాడి
ముసిముసినవ్వులనే మోవిచూపీని
విసవిస నేతెంచి విడెము చేతికిచ్చెను
యెసఁగ తనయాసోద మింకా నెంతగలదో

(॥నీవి॥)
కందువలు చూపిచూపి కనుసన్నలు సేసీ నీ-
ముందరికి వచ్చి నీకు మొక్కు మొక్కీని
విందువలె సారెసారె విన్నపాలు నీకుఁ జెప్పీ
యిందరిలోఁ దనయాస యింకా నెంతగలదో

(॥నీవి॥)
వుడివోనివేడుకతో నూడిగాలెల్లాఁ గావించి
నిడువాలుఁజూపులు నీపైఁ జల్లీని
అడరి నన్నేలితివి అన్నిటా శ్రీవేంకటేశ
యెడయనితనయాస యింకా నెంతగలదో

(||pallavi||)
nīvichchina sanavĕllā nĕrabīm̐ dānu
yīvalam̐ dana yāsoda miṁkā nĕṁtagalado

(||nīvi||)
kŏsarigŏsari ninnum̐ gŏmma nīdo māḍalāḍi
musimusinavvulane movisūbīni
visavisa nedĕṁchi viḍĕmu sedigichchĕnu
yĕsam̐ga tanayāsoda miṁkā nĕṁtagalado

(||nīvi||)
kaṁduvalu sūbisūbi kanusannalu sesī nī-
muṁdarigi vachchi nīgu mŏkku mŏkkīni
viṁduvalĕ sārĕsārĕ vinnabālu nīgum̐ jĕppī
yiṁdarilom̐ danayāsa yiṁkā nĕṁtagalado

(||nīvi||)
vuḍivoniveḍugado nūḍigālĕllām̐ gāviṁchi
niḍuvālum̐jūbulu nībaim̐ jallīni
aḍari nannelidivi anniḍā śhrīveṁkaḍeśha
yĕḍayanidanayāsa yiṁkā nĕṁtagalado