Neevichchina saligene ninnu ne nimta dooridi

నీవిచ్చిన సలిగెనే నిన్ను నే నింత దూరితి
Language

(॥పల్లవి॥)
నీవిచ్చిన సలిగెనే నిన్ను నే నింత దూరితి
కావరించ కంత నీవు గరడిలోపలను

(॥నీవి॥)
తప్పులేదు నీయందు తగిన జాణఁడవే
చప్పనాయ మోహము సారె నే రాఁగా
వుప్పఁ జేసి ఇంచుకంత వుండరాదా ఇంటిలోన
ఇప్పుడేల పదరేవు యెదురైన వేళను

(॥నీవి॥)
వెగటు లేదు నీ యందు విభుఁడవు నాకు నీవే
మొగచాటాయ నారతి ముంచి పొందఁగా
పగటుఁదమి వుట్టించె పవళించరాదా యిఁక
మొగమేమి చూచేవు మొగసాల లోనను

(॥నీవి॥)
కొఱత లేదు నీవల్లఁ గోరి శ్రీ వేంకటేశుఁడ
తఱితోఁ దరితీపాయ దమి రేఁచఁగా
గుఱిగాఁ గూడితి విట్టె గుట్టుతోడ నుండరాదా
మఱఁగేల దోమతెర మంచము లోనను

(||pallavi||)
nīvichchina saligĕne ninnu ne niṁta dūridi
kāvariṁcha kaṁta nīvu garaḍilobalanu

(||nīvi||)
tappuledu nīyaṁdu tagina jāṇam̐ḍave
sappanāya mohamu sārĕ ne rām̐gā
vuppam̐ jesi iṁchugaṁta vuṁḍarādā iṁṭilona
ippuḍela padarevu yĕduraina veḽanu

(||nīvi||)
vĕgaḍu ledu nī yaṁdu vibhum̐ḍavu nāgu nīve
mŏgasāḍāya nāradi muṁchi pŏṁdam̐gā
pagaḍum̐dami vuṭṭiṁchĕ pavaḽiṁcharādā yim̐ka
mŏgamemi sūsevu mŏgasāla lonanu

(||nīvi||)
kŏṟada ledu nīvallam̐ gori śhrī veṁkaḍeśhum̐ḍa
taṟidom̐ daridībāya dami rem̐sam̐gā
guṟigām̐ gūḍidi viṭṭĕ guṭṭudoḍa nuṁḍarādā
maṟam̐gela domadĕra maṁchamu lonanu