నీవెట్టు సేసినాఁ జేయి నీ పాదమే గతి నాకు
(॥పల్లవి॥)
నీవెట్టు సేసినాఁ జేయి నీ పాదమే గతి నాకు
యీవేళ చిత్తాన వేరే భావించకువయ్యా
(॥॥)
కోరి పొందు సేసేదానఁ గోపగింతునా యేమి
ఆ రీతిఁ బాయనిదాన నలుగుదునా
గారవించి కూడేదానఁ గసరి జంకింతునా
చేరి నీకు నిచ్చకమే సేతుఁగాకా
(॥॥)
యితవరి నైనదాన యెగ్గులు వట్టే నా
సతి నైన దాన నిన్ను సాదించేనా
రతికిఁ బిలిచేదాన రాయడిఁ బెట్టే నా
సతమైన నీ గుణాలే సంతోసింతుఁ గాకా
(॥॥)
నీకు దేవులై నదా నేరములు వెదకేనా
చేకొని కూడినదానఁ జింత రేఁచేనా
యీకడ శ్రీ వేంకటేశ యిన్నిటా నన్నేలితివి
జోకగాఁ బొగడి మేలే చూపుదుఁ గాకా
(||pallavi||)
nīvĕṭṭu sesinām̐ jeyi nī pādame gadi nāgu
yīveḽa sittāna vere bhāviṁchaguvayyā
(||||)
kori pŏṁdu sesedānam̐ gobagiṁtunā yemi
ā rīdim̐ bāyanidāna nalugudunā
gāraviṁchi kūḍedānam̐ gasari jaṁkiṁtunā
seri nīgu nichchagame sedum̐gāgā
(||||)
yidavari nainadāna yĕggulu vaṭṭe nā
sadi naina dāna ninnu sādiṁchenā
radigim̐ bilisedāna rāyaḍim̐ bĕṭṭe nā
sadamaina nī guṇāle saṁtosiṁtum̐ gāgā
(||||)
nīgu devulai nadā neramulu vĕdagenā
segŏni kūḍinadānam̐ jiṁta rem̐senā
yīgaḍa śhrī veṁkaḍeśha yinniḍā nannelidivi
jogagām̐ bŏgaḍi mele sūbudum̐ gāgā