నీవెట్టు మగవాఁడవు నీవేమి సేసినాఁ జెల్లు
(॥పల్లవి॥)
నీవెట్టు మగవాఁడవు నీవేమి సేసినాఁ జెల్లు
నావంటివారు చూచి నన్ను నాడుకొనరా
(॥నీవె॥)
పాలుపడి గుట్టుతో నీపాదాలు విసుకఁగాను
గేలితోఁ బయ్యదకొంగు కేలఁ దీసేవు
మూలనున్న సిగ్గు లివి ముంగిట వేయఁగాను
సోలినున్నవతులు చులుకఁగా జూడరా
(॥నీవె॥)
పొసఁగ నీతురుమునఁ బూవులు నే ముడువఁగ
కసుగాటుగా మోవి గంటిసేసేవు
కొసరి వలపు లింత కూరాకు సేయఁగాను
దెసలఁ బెండ్లాడిన దేవుళ్లెల్ల నగరా
(॥నీవె॥)
అక్కరతో బాగా లిచ్చి ఆకుమడి చియ్యఁగాను
గక్కనఁ జెక్కులు నొక్కి కాఁగిలించేవు
తక్కక శ్రీవేంకటేశ తమి యింత రేఁచఁగాను
మొక్కుమని సతులు మోములు చూచుకొనరా
(||pallavi||)
nīvĕṭṭu magavām̐ḍavu nīvemi sesinām̐ jĕllu
nāvaṁṭivāru sūsi nannu nāḍugŏnarā
(||nīvĕ||)
pālubaḍi guṭṭudo nībādālu visugam̐gānu
gelidom̐ bayyadagŏṁgu kelam̐ dīsevu
mūlanunna siggu livi muṁgiḍa veyam̐gānu
solinunnavadulu sulugam̐gā jūḍarā
(||nīvĕ||)
pŏsam̐ga nīdurumunam̐ būvulu ne muḍuvam̐ga
kasugāḍugā movi gaṁṭisesevu
kŏsari valabu liṁta kūrāgu seyam̐gānu
dĕsalam̐ bĕṁḍlāḍina devuḽlĕlla nagarā
(||nīvĕ||)
akkarado bāgā lichchi āgumaḍi siyyam̐gānu
gakkanam̐ jĕkkulu nŏkki kām̐giliṁchevu
takkaga śhrīveṁkaḍeśha tami yiṁta rem̐sam̐gānu
mŏkkumani sadulu momulu sūsugŏnarā