Neevetlaa numdinaanu neegemayyaa

నీవెట్లా నుండినాను నీకేమయ్యా
Language

(॥పల్లవి॥)
నీవెట్లా నుండినాను నీకేమయ్యా
మావంటివారికి నేమము వలెఁగాక

(॥నీవె॥)
మగవాఁ డేమిసేసినాను మరి యేడా నెగ్గులేదు
తగవులు దప్పినాను తప్పులెంచరు
జిగిమీరి సిగ్గువిడిచినాఁ గాదనియనరు
మగువలనై తేను మనసు లొరతురు

(॥నీవె॥)
దొరపాటివానికి దోసము గలదనరు
విరసాలు చేసినాను వెఱపులేదు
పొరపొచ్చాన నుండినా బుద్దులుచెప్ప రెవ్వరు
తరుణుల మాఁటలే తగ ఱట్టుసేతురు

(॥నీవె॥)
వేడుకకాని సేఁతలు వెల్లవిరిగాఁ జేయరు
యేడనుఁడి వచ్చినాను యేమీననరు
కూడితిని నన్ను నేడు కూరిమి శ్రీవేంకటేశ
చేడెలు నీవద్దనుంటే చెలఁగి నవ్వుదురు

(||pallavi||)
nīvĕṭlā nuṁḍinānu nīgemayyā
māvaṁṭivārigi nemamu valĕm̐gāga

(||nīvĕ||)
magavām̐ ḍemisesinānu mari yeḍā nĕgguledu
tagavulu dappinānu tappulĕṁcharu
jigimīri sigguviḍisinām̐ gādaniyanaru
maguvalanai tenu manasu lŏraduru

(||nīvĕ||)
dŏrabāḍivānigi dosamu galadanaru
virasālu sesinānu vĕṟabuledu
pŏrabŏchchāna nuṁḍinā buddulusĕppa rĕvvaru
taruṇula mām̐ṭale taga ṟaṭṭuseduru

(||nīvĕ||)
veḍugagāni sem̐talu vĕllavirigām̐ jeyaru
yeḍanum̐ḍi vachchinānu yemīnanaru
kūḍidini nannu neḍu kūrimi śhrīveṁkaḍeśha
seḍĕlu nīvaddanuṁṭe sĕlam̐gi navvuduru