Neeverimgina buddule nemoo neegum jeppemu

నీవెరిఁగిన బుద్దులే నేమూ నీకుఁ జెప్పేము
Language

(॥పల్లవి॥)
నీవెరిఁగిన బుద్దులే నేమూ నీకుఁ జెప్పేము
యేవేళాఁ జెలులము నే మెచ్చరించవలెను

(॥నీవె॥)
పెనుఁగుచు సరసము పెంచితేఁ బెరుగును
వినయమే నెరపితే వేడుక వుట్టు
మునుకొని మొక్కితేను మొగమోట సమకూడు
మనసురా మెలఁగితే మగఁడు మన్నించునే

(॥నీవె॥)
తగులు వాయకవుంటే తనుఁదానె దయవుట్టు
నగితేఁ జుట్టురికము నాఁటుకొనును
తగవు నడిపితేఁ బంతములెల్లా నీడేరు
మగువ వోరుపు గలితే మగఁడు మన్నించునే

(॥నీవె॥)
ఇచ్చకమే చూపితేను యింపులౌను రతులెల్లా
యెచ్చరించి కూడితేను యితవైయుండు
కొచ్చి యలమేలుమంగఁ గూడె శ్రీవేంకటేశుఁడు
మచ్చిక నీతఁడే నీమగఁడు మన్నించునే

(||pallavi||)
nīvĕrim̐gina buddule nemū nīgum̐ jĕppemu
yeveḽām̐ jĕlulamu ne mĕchchariṁchavalĕnu

(||nīvĕ||)
pĕnum̐gusu sarasamu pĕṁchidem̐ bĕrugunu
vinayame nĕrabide veḍuga vuṭṭu
munugŏni mŏkkidenu mŏgamoḍa samagūḍu
manasurā mĕlam̐gide magam̐ḍu manniṁchune

(||nīvĕ||)
tagulu vāyagavuṁṭe tanum̐dānĕ dayavuṭṭu
nagidem̐ juṭṭurigamu nām̐ṭugŏnunu
tagavu naḍibidem̐ baṁtamulĕllā nīḍeru
maguva vorubu galide magam̐ḍu manniṁchune

(||nīvĕ||)
ichchagame sūbidenu yiṁpulaunu radulĕllā
yĕchchariṁchi kūḍidenu yidavaiyuṁḍu
kŏchchi yalamelumaṁgam̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
machchiga nīdam̐ḍe nīmagam̐ḍu manniṁchune