Neeveramgavadavayyaa nelamtagu garvamani

నీవెరఁగవటవయ్యా నెలఁతకు గర్వమని
Language

(॥పల్లవి॥)
నీవెరఁగవటవయ్యా నెలఁతకు గర్వమని
ఆవల నీవలనట్టే ఆడేవు గాక

(॥నీవె॥)
ఆఁటదానికిని సిగ్గే అంతటా నిండినసొమ్ము
నాఁటుకోఁజూచే చూపే నమ్మినసొమ్ము
మేఁటి మురిపెములే మిక్కిలి దాఁచినసొమ్ము
వాఁటపు సెలవినవ్వే వన్నెలసొమ్ము

(॥నీవె॥)
కాంతకును గుట్టు తోడి గంభీరమే సొమ్ము
యెంతైనాఁ బదరకుండుటెక్కువసొమ్ము
పంతపు మాటలాడుటె భావము నిండిన సొమ్ము
మంతుకెక్కే సణఁగులు మాయని సొమ్ము

(॥నీవె॥)
తరుణికిఁ బతితోడి తరితీపులే సొమ్ము
బిరుదురతులె చాలాఁ బెట్టిన సొమ్ము
నిరతి శ్రీ వేంకటేశ నీతోఁ బెనఁగుటే సొమ్ము
సరుస మంచముపై రాజసమే సొమ్ము

(||pallavi||)
nīvĕram̐gavaḍavayyā nĕlam̐tagu garvamani
āvala nīvalanaṭṭe āḍevu gāga

(||nīvĕ||)
ām̐ṭadānigini sigge aṁtaḍā niṁḍinasŏmmu
nām̐ṭugom̐jūse sūbe namminasŏmmu
mem̐ṭi muribĕmule mikkili dām̐sinasŏmmu
vām̐ṭabu sĕlavinavve vannĕlasŏmmu

(||nīvĕ||)
kāṁtagunu guṭṭu toḍi gaṁbhīrame sŏmmu
yĕṁtainām̐ badaraguṁḍuḍĕkkuvasŏmmu
paṁtabu māḍalāḍuḍĕ bhāvamu niṁḍina sŏmmu
maṁtugĕkke saṇam̐gulu māyani sŏmmu

(||nīvĕ||)
taruṇigim̐ badidoḍi taridībule sŏmmu
biruduradulĕ sālām̐ bĕṭṭina sŏmmu
niradi śhrī veṁkaḍeśha nīdom̐ bĕnam̐guḍe sŏmmu
sarusa maṁchamubai rājasame sŏmmu