Neeveṟamgavaa yivi nelamtala nerubulu

నీవెఱఁగవా యివి నెలఁతల నేరుపులు
Language

(॥పల్లవి॥)
నీవెఱఁగవా యివి నెలఁతల నేరుపులు
వావి గలసినవారు వాసులు నెరపరా

(॥నీవె॥)
పంతమాడరాదు గాక పడతికిఁ సారె సారె
యెంత సేయరాదు పతి నెలయించి
వింతదానఁ గాఁ గనక వెన్నెల నవ్వునవ్వితి
జంతలైన వారైతే జంకించరా

(॥నీవె॥)
జగడించరాదు గాక సతులకు సారెసారె
పగటెంత చూపరాదు పచ్చి దోఁచను
తగినదానఁ గనక తలఁపు దాఁచనైతి
యెగసక్కెవు వారైతే నెమ్మె చూపరా

(॥నీవె॥)
వాసులెంచరాదు గాక వనితకు సారె సారె
సేసలెన్ని వెట్టరాదు చిమ్మి రేఁగి
సేసుకుందానఁ గనక శ్రీవేంకటేశ పొందితి
యీ సుద్దుల కొకరైతే నెంతయినాఁ జేయరా

(||pallavi||)
nīvĕṟam̐gavā yivi nĕlam̐tala nerubulu
vāvi galasinavāru vāsulu nĕrabarā

(||nīvĕ||)
paṁtamāḍarādu gāga paḍadigim̐ sārĕ sārĕ
yĕṁta seyarādu padi nĕlayiṁchi
viṁtadānam̐ gām̐ ganaga vĕnnĕla navvunavvidi
jaṁtalaina vāraide jaṁkiṁcharā

(||nīvĕ||)
jagaḍiṁcharādu gāga sadulagu sārĕsārĕ
pagaḍĕṁta sūbarādu pachchi dom̐sanu
taginadānam̐ ganaga talam̐pu dām̐sanaidi
yĕgasakkĕvu vāraide nĕmmĕ sūbarā

(||nīvĕ||)
vāsulĕṁcharādu gāga vanidagu sārĕ sārĕ
sesalĕnni vĕṭṭarādu simmi rem̐gi
sesuguṁdānam̐ ganaga śhrīveṁkaḍeśha pŏṁdidi
yī suddula kŏgaraide nĕṁtayinām̐ jeyarā