Neeveṟamgavaa tagavu nerubari vinnidaanu

నీవెఱఁగవా తగవు నేరుపరి విన్నిటాను
Language

(॥పల్లవి॥)
నీవెఱఁగవా తగవు నేరుపరి విన్నిటాను
వేవేలు గతుల నేము విన్నవించే దేమి

(॥నీవె॥)
చనవుగలుగుసతి సణఁగులు రాలిచితే
యెనసినపతి యెగ్గు లెంచరాదు
తనివోని తమితోడ తరుణులు జంకించితే
వినయముతో డుత వేఁడుకొనవలెను

(॥నీవె॥)
వేడుకగల తరుణి వెక్కసములాడితేను
వాడికైనమగవాఁడు వద్దనరాదు
కూడినమందెమేళాన కొన్నులు గొసరితేను
పాడిపంతాలు నెరసి బత్తిచూపవలెను

(॥నీవె॥)
చుట్టమైన జవరాలు సొలసి పెనఁగితేను
జట్టిగొన్న నెరజాణ సాదించరాదు
ఇట్టె యలమేలుమంగ నేలిన శ్రీవేంకటేశ
పట్టపుదేవులఁజేసి పాయకుండవలెను

(||pallavi||)
nīvĕṟam̐gavā tagavu nerubari vinniḍānu
vevelu gadula nemu vinnaviṁche demi

(||nīvĕ||)
sanavugalugusadi saṇam̐gulu rāliside
yĕnasinabadi yĕggu lĕṁcharādu
tanivoni tamidoḍa taruṇulu jaṁkiṁchide
vinayamudo ḍuda vem̐ḍugŏnavalĕnu

(||nīvĕ||)
veḍugagala taruṇi vĕkkasamulāḍidenu
vāḍigainamagavām̐ḍu vaddanarādu
kūḍinamaṁdĕmeḽāna kŏnnulu gŏsaridenu
pāḍibaṁtālu nĕrasi battisūbavalĕnu

(||nīvĕ||)
suṭṭamaina javarālu sŏlasi pĕnam̐gidenu
jaṭṭigŏnna nĕrajāṇa sādiṁcharādu
iṭṭĕ yalamelumaṁga nelina śhrīveṁkaḍeśha
paṭṭabudevulam̐jesi pāyaguṁḍavalĕnu