నీవెఱఁగవా తగవు నెఱజాణ విన్నిటాను
(॥పల్లవి॥)
నీవెఱఁగవా తగవు నెఱజాణ విన్నిటాను
వేవేలకు నేమూ నీకు విన్నవించే మిపుడు
(॥నీవె॥)
వలచినయాటదాని వద్దని తోయఁదగదు
తలకొని వెదకఁగా దాఁచఁదగదు
పిలిచి వేఁడుకోఁగాను పెనఁగ మరి తగదు
చెలియప్రియము లిఁకఁ జేకొనవయ్యా
(॥నీవె॥)
చేయెత్తి నీకు మొక్కఁగా సిగ్గులు వడఁదగదు
ఆయము లంటఁగా నౌఁగాదనఁ దగదు
పాయక బత్తి సేయఁగా పరాకు సేయఁదగదు
యాయింతికోరిక లిఁక నీడేరించవయ్యా
(॥నీవె॥)
తాలిమితోఁ జూడఁగాను తలవంచుకోఁదగదు
కేలువట్టి తియ్యఁగా జంకించఁదగదు
యేలితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
నీలాలకేచన విఁక లెరవేరించవయ్యా
(||pallavi||)
nīvĕṟam̐gavā tagavu nĕṟajāṇa vinniḍānu
vevelagu nemū nīgu vinnaviṁche mibuḍu
(||nīvĕ||)
valasinayāḍadāni vaddani toyam̐dagadu
talagŏni vĕdagam̐gā dām̐sam̐dagadu
pilisi vem̐ḍugom̐gānu pĕnam̐ga mari tagadu
sĕliyapriyamu lim̐kam̐ jegŏnavayyā
(||nīvĕ||)
seyĕtti nīgu mŏkkam̐gā siggulu vaḍam̐dagadu
āyamu laṁṭam̐gā naum̐gādanam̐ dagadu
pāyaga batti seyam̐gā parāgu seyam̐dagadu
yāyiṁtigoriga lim̐ka nīḍeriṁchavayyā
(||nīvĕ||)
tālimidom̐ jūḍam̐gānu talavaṁchugom̐dagadu
keluvaṭṭi tiyyam̐gā jaṁkiṁcham̐dagadu
yelidivi śhrīveṁkaḍeśha yalamelmaṁganu
nīlālagesana vim̐ka lĕraveriṁchavayyā