Neeveṟamgavaa tagavu nemu seppe demunnadi

నీవెఱఁగవా తగవు నేము చెప్పే దేమున్నది
Language

(॥పల్లవి॥)
నీవెఱఁగవా తగవు నేము చెప్పే దేమున్నది
కైవశమైతివి నీవే కాదా యితనికి

(॥నీవె॥)
చేరి చేరి యతఁడు నీచెఱఁగు వట్టెనంటాను
సారెకు బొమ్మల నెంత జంకించేవే
యారీతి నీ వెదుటికి నెలఇంచవచ్చితేను
నేరుపుతోఁ జెనకితే నేరమా ఇతనికి

(॥నీవె॥)
వచ్చి వచ్చి యతఁడు నీవద్దఁ గూచుండెనంటాను
కొచ్చిచూ చతనినేల గుంపించేవే
ఇచ్చట నీ చుట్టరిక మిటు నీవు నెరపఁగా
తచ్చి నీతోఁ బొందు సేయఁదగదా ఇతనికి

(॥నీవె॥)
నొక్కి నొక్కి నీ చెక్కులు నునుగోర నూఁదెనంటా
వెక్కసముగా నేమి వెంగేలాడేవే
యిక్కడ శ్రీవేంకటేశునెదపై నీవుండఁగాను
చిక్కించుక రతిఁగూడఁ జెల్లదా యితనికి

(||pallavi||)
nīvĕṟam̐gavā tagavu nemu sĕppe demunnadi
kaivaśhamaidivi nīve kādā yidanigi

(||nīvĕ||)
seri seri yadam̐ḍu nīsĕṟam̐gu vaṭṭĕnaṁṭānu
sārĕgu bŏmmala nĕṁta jaṁkiṁcheve
yārīdi nī vĕduḍigi nĕla̮iṁchavachchidenu
nerubudom̐ jĕnagide neramā idanigi

(||nīvĕ||)
vachchi vachchi yadam̐ḍu nīvaddam̐ gūsuṁḍĕnaṁṭānu
kŏchchisū sadaninela guṁpiṁcheve
ichchaḍa nī suṭṭariga miḍu nīvu nĕrabam̐gā
tachchi nīdom̐ bŏṁdu seyam̐dagadā idanigi

(||nīvĕ||)
nŏkki nŏkki nī sĕkkulu nunugora nūm̐dĕnaṁṭā
vĕkkasamugā nemi vĕṁgelāḍeve
yikkaḍa śhrīveṁkaḍeśhunĕdabai nīvuṁḍam̐gānu
sikkiṁchuga radim̐gūḍam̐ jĕlladā yidanigi