Neeveṟamgavaa seliya nerajaana vinnidaanu

నీవెఱఁగవా చెలియ నెరజాణ విన్నిటాను
Language

(॥పల్లవి॥)
నీవెఱఁగవా చెలియ నెరజాణ విన్నిటాను
వావిరి నేఁ జెప్పనేల వలపుజాడ లివి

(॥నీవె॥)
వినయము గలిగితే వేడుకలు సమకూరు
మనసెనసితేను ప్రేమము వుట్టును
ననుపు గలిగితేను నాఁటుకొను మోహము
వనితకుఁ బతికిని వలపురజాడ లివి

(॥నీవె॥)
వోరుపు గలిగితేనే వొనరుఁ జుట్టరికాలు
నేరుపే కలిగితేను నేస్తమీడేరు
కూరిమి గలిగితేను కొనసాగు భోగములు
వారక యెవ్పరికైనా వలపుజాడ లివి

(॥నీవె॥)
యిచ్చకము గలిగితే నింపులెల్లా నిండుకొను
ముచ్చట లొనరితేను ముదమలరు
యిచ్చట శ్రీవేంకటేశుఁ డేలె నిన్ను నింతలోనె
వచ్చి యిదె వున్నాఁడు మీవలపుజాడ లివి

(||pallavi||)
nīvĕṟam̐gavā sĕliya nĕrajāṇa vinniḍānu
vāviri nem̐ jĕppanela valabujāḍa livi

(||nīvĕ||)
vinayamu galigide veḍugalu samagūru
manasĕnasidenu premamu vuṭṭunu
nanubu galigidenu nām̐ṭugŏnu mohamu
vanidagum̐ badigini valaburajāḍa livi

(||nīvĕ||)
vorubu galigidene vŏnarum̐ juṭṭarigālu
nerube kaligidenu nestamīḍeru
kūrimi galigidenu kŏnasāgu bhogamulu
vāraga yĕvparigainā valabujāḍa livi

(||nīvĕ||)
yichchagamu galigide niṁpulĕllā niṁḍugŏnu
muchchaḍa lŏnaridenu mudamalaru
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnu niṁtalonĕ
vachchi yidĕ vunnām̐ḍu mīvalabujāḍa livi