నీవెఱఁగని తగవు నేమెరిఁగేమా
(॥పల్లవి॥)
నీవెఱఁగని తగవు నేమెరిఁగేమా
కైవసమై యిటులైతే కాఁతాళము వుట్టదా
(॥॥)
ప్రియముతో వలపించి పెడవాడ వేయనేల
దయతోడ మన్నించఁ దగుఁ గాక
నయమునఁ బొందు లేనినాఁడోర్వవచ్చుఁగాక
క్రియఁచూపి పొనిఁగితే కేలిఁ గాఁక రేఁగదా
(॥॥)
బత్తితోడ బిలిపించి పరాకులు చూపనేల
చిత్తగించి యాదరించఁ జెల్లుఁ గాక
హత్తి మాటలాడనినాఁ డైనట్లాయఁ గాక
పొత్తుకు వచ్చి లోఁగితే బూటకమై వుండదా
(॥॥)
చెలిమితోఁ గాఁగిలించి సిగ్గులువడఁగ నేల
వలసిన చనవియ్యవలెఁ గాక
యెలమి శ్రీవేంకటేశ యిందాఁకా గుట్టు గాక
తలకొని కొసరితే తమకము నిండదా
(||pallavi||)
nīvĕṟam̐gani tagavu nemĕrim̐gemā
kaivasamai yiḍulaide kām̐tāḽamu vuṭṭadā
(||||)
priyamudo valabiṁchi pĕḍavāḍa veyanela
dayadoḍa manniṁcham̐ dagum̐ gāga
nayamunam̐ bŏṁdu leninām̐ḍorvavachchum̐gāga
kriyam̐sūbi pŏnim̐gide kelim̐ gām̐ka rem̐gadā
(||||)
battidoḍa bilibiṁchi parāgulu sūbanela
sittagiṁchi yādariṁcham̐ jĕllum̐ gāga
hatti māḍalāḍaninām̐ ḍainaṭlāyam̐ gāga
pŏttugu vachchi lom̐gide būḍagamai vuṁḍadā
(||||)
sĕlimidom̐ gām̐giliṁchi sigguluvaḍam̐ga nela
valasina sanaviyyavalĕm̐ gāga
yĕlami śhrīveṁkaḍeśha yiṁdām̐kā guṭṭu gāga
talagŏni kŏsaride tamagamu niṁḍadā