నీవెఱఁగని తగవు నే విన్నవించేనా
(॥పల్లవి॥)
నీవెఱఁగని తగవు నే విన్నవించేనా
వేవేలైనాఁ దమలోన వేసరింతురా
(॥॥)
కడువలచినవారు కదియవత్తురు గాక
యెడమాట లాడింతురా యింతులచేత
యెడయలేనివారు యింపులు సేతురు గాక
జడియక బొమ్మలను జంకింతురా
(॥॥)
పాయరానియట్టివారు పైపై నవ్వుదురు గాక
చాయలా సన్నలా నింత సాదింతురా
ఆయమెఱిఁగినవారు అట్టె మెప్పింతురు గాక
కామకపుచేఁతలను కాకుసేతురా
(॥॥)
తగులాయమైనవారు తతిగోనుందురు గాక
పగటున కాఁతాళించి పచ్చిసేతురా
నిగిడి శ్రీ వేంకటేశ నెలఁతఁ గూడితి విట్టె
అగడుగా రతులలో నలయింతురా
(||pallavi||)
nīvĕṟam̐gani tagavu ne vinnaviṁchenā
vevelainām̐ damalona vesariṁturā
(||||)
kaḍuvalasinavāru kadiyavatturu gāga
yĕḍamāḍa lāḍiṁturā yiṁtulaseda
yĕḍayalenivāru yiṁpulu seduru gāga
jaḍiyaga bŏmmalanu jaṁkiṁturā
(||||)
pāyarāniyaṭṭivāru paibai navvuduru gāga
sāyalā sannalā niṁta sādiṁturā
āyamĕṟim̐ginavāru aṭṭĕ mĕppiṁturu gāga
kāmagabusem̐talanu kāgusedurā
(||||)
tagulāyamainavāru tadigonuṁduru gāga
pagaḍuna kām̐tāḽiṁchi pachchisedurā
nigiḍi śhrī veṁkaḍeśha nĕlam̐tam̐ gūḍidi viṭṭĕ
agaḍugā radulalo nalayiṁturā