నీవెఱఁగని బుద్దులు నేము చెప్పమా
(॥పల్లవి॥)
నీవెఱఁగని బుద్దులు నేము చెప్పమా
భావమే యెరుఁగుఁ గాన పచ్చి సేయఁగలమా
(॥॥)
పూవువంటిది వయసు భోగించవలెఁగాక
చేవదేరే యీసిగ్గు చెల్లఁబోయెలే
మీవంటివారికా మీరరానివొట్లివి
దైవము దూరుతగాక తగదనఁగలమా
(॥॥)
కప్పురమువంటి దిట్టె కలిగె నీమోహము
నిప్పువంటి విరహము నీకేలే
యిప్పుడిది వేళా ఇద్దరి యెగ్గులకును
చెప్పరాని చేఁత మీచేఁ జేయించఁగలమా
(॥॥)
పండువంటిది మోవి పదరి చేకొంటగాక
కొండవంటిదికోపము చేకొన నీకేలే
అండనే శ్రీవేంకటేశు నలమి కూడితి విట్టె
మెండుననుండేటిమిమ్ము మొచ్చనైనఁగలమా
(||pallavi||)
nīvĕṟam̐gani buddulu nemu sĕppamā
bhāvame yĕrum̐gum̐ gāna pachchi seyam̐galamā
(||||)
pūvuvaṁṭidi vayasu bhogiṁchavalĕm̐gāga
sevadere yīsiggu sĕllam̐boyĕle
mīvaṁṭivārigā mīrarānivŏṭlivi
daivamu dūrudagāga tagadanam̐galamā
(||||)
kappuramuvaṁṭi diṭṭĕ kaligĕ nīmohamu
nippuvaṁṭi virahamu nīgele
yippuḍidi veḽā iddari yĕggulagunu
sĕpparāni sem̐ta mīsem̐ jeyiṁcham̐galamā
(||||)
paṁḍuvaṁṭidi movi padari segŏṁṭagāga
kŏṁḍavaṁṭidigobamu segŏna nīgele
aṁḍane śhrīveṁkaḍeśhu nalami kūḍidi viṭṭĕ
mĕṁḍunanuṁḍeḍimimmu mŏchchanainam̐galamā