నీవేఁటికిఁ జింతించేవే నీ మగఁడు నిన్ను నేలీ
(॥పల్లవి॥)
నీవేఁటికిఁ జింతించేవే నీ మగఁడు నిన్ను నేలీ
కావలసిన పనులు కమ్ముకొనీఁగాక
(॥నీవేఁ॥)
తలఁపులో తమకము దట్టమై నెరిగితేను
చెలిమి మిక్కుటమై చేఁగయెక్కదా
తలకొన్న జవ్వనము తతివచ్చి పొదలఁగా
కలయిక రతులు పోఁకకుఁ బుట్టెఁ డమ్మవా
(॥నీవేఁ॥)
కందువచుట్టరికము కలుగఁ బెనఁగితేను
ముందు ముందే వలపులు మోపులుగావా
సందడించి మాటలు చవులుగా నాడితేను
యిందరికి మోహనరసా లేరులు గావా
(॥నీవేఁ॥)
తగులైన కోరికలు తారుకాణలైతేను
నగవులు సెలవుల ననలొత్తవా
జిగి నిన్నుఁ గూడె నిదె శ్రీవేంకటేశ్వరుఁడు
నిగిడి కాఁగిటిసొంపు నిచ్చపెండ్లి గాదా
(||pallavi||)
nīvem̐ṭigim̐ jiṁtiṁcheve nī magam̐ḍu ninnu nelī
kāvalasina panulu kammugŏnīm̐gāga
(||nīvem̐||)
talam̐pulo tamagamu daṭṭamai nĕrigidenu
sĕlimi mikkuḍamai sem̐gayĕkkadā
talagŏnna javvanamu tadivachchi pŏdalam̐gā
kalayiga radulu pom̐kagum̐ buṭṭĕm̐ ḍammavā
(||nīvem̐||)
kaṁduvasuṭṭarigamu kalugam̐ bĕnam̐gidenu
muṁdu muṁde valabulu mobulugāvā
saṁdaḍiṁchi māḍalu savulugā nāḍidenu
yiṁdarigi mohanarasā lerulu gāvā
(||nīvem̐||)
tagulaina korigalu tārugāṇalaidenu
nagavulu sĕlavula nanalŏttavā
jigi ninnum̐ gūḍĕ nidĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
nigiḍi kām̐giḍisŏṁpu nichchabĕṁḍli gādā