నీవెంతసేసినా నీకె నిన్ను మీరీనా
(॥పల్లవి॥)
నీవెంతసేసినా నీకె నిన్ను మీరీనా
కావరించేవు మచ్చము గనేనంటా నీకెను
(॥నీవెం॥)
చలపట్టి నీవేల సాదించవచ్చేవు
నలినాక్షి గోర నూఁదె నవ్వుతా నిన్ను
మలసి యంతేసి దిమ్మరితిల్లు దిట్టేవు
చలిగొనఁ బన్నీరు చల్లెనంటా నీపెను
(॥నీవెం॥)
పంతములాడఁగ నేల పలుమారు నాకెతోను
వింతవింతమాటలడే వేడుకకును
పొంతనుండి వూరకైనా బొమ్మల జంకించేవు
దొతిఁబెట్టి పాదములఁ దొక్కెనంటా నీపెను
(॥నీవెం॥)
వాసులేల నెరపేవు వడి నలమేల్మంగతో
రేసువోఁ జుట్టిరికమే పూసె నీకును
అసవెట్టి శ్రీవేంకటాధిప కూడితి విట్టె
సేసకొప్పు వంచి బత్తిసేసెనంటా నీపెను
(||pallavi||)
nīvĕṁtasesinā nīgĕ ninnu mīrīnā
kāvariṁchevu machchamu ganenaṁṭā nīgĕnu
(||nīvĕṁ||)
salabaṭṭi nīvela sādiṁchavachchevu
nalinākṣhi gora nūm̐dĕ navvudā ninnu
malasi yaṁtesi dimmaridillu diṭṭevu
saligŏnam̐ bannīru sallĕnaṁṭā nībĕnu
(||nīvĕṁ||)
paṁtamulāḍam̐ga nela palumāru nāgĕdonu
viṁtaviṁtamāḍalaḍe veḍugagunu
pŏṁtanuṁḍi vūragainā bŏmmala jaṁkiṁchevu
dŏdim̐bĕṭṭi pādamulam̐ dŏkkĕnaṁṭā nībĕnu
(||nīvĕṁ||)
vāsulela nĕrabevu vaḍi nalamelmaṁgado
resuvom̐ juṭṭirigame pūsĕ nīgunu
asavĕṭṭi śhrīveṁkaḍādhiba kūḍidi viṭṭĕ
sesagŏppu vaṁchi battisesĕnaṁṭā nībĕnu