Neevemta sesinaanu neegamarunu

నీవెంత సేసినాను నీకమరును
Language

(॥పల్లవి॥)
నీవెంత సేసినాను నీకమరును
యీవల మావంటివారి కితవౌనా నేఁడు

(॥నీవెం॥)
విడువక ఆపె నీతో విన్నపాలు సేయఁగాను
నడుమ నే మాటాడితే నవ్వరా నన్ను
యెడమిచ్చి నీవె నన్నుయిట్టె మన్నించఁ జూచేవు
పడఁతులతోననెల్ల పచ్చిగాదా నాకు

(॥నీవెం॥)
సరినుండి యాపె నీతో సరసమాడేటి వేళ
వరుస వంతడుగంగ వైపా నాకు
తరలక కొంగువట్టి దగ్గర నన్నుఁదీసేవు
తరుణులపై కొసరు తగవా నాకు

(॥నీవెం॥)
వొంటినుండి యాపె నీకునూడిగాలు సేయరాఁగా
జంటై నేఁ దిరిగేది సరవా నాకు
వెంటనే శ్రీవేంకటాద్రి వెన్నముద్ద క్రిష్ణరాయ
అంటి నన్నుఁ గూడితివి అరుదాయ నాకు

(||pallavi||)
nīvĕṁta sesinānu nīgamarunu
yīvala māvaṁṭivāri kidavaunā nem̐ḍu

(||nīvĕṁ||)
viḍuvaga ābĕ nīdo vinnabālu seyam̐gānu
naḍuma ne māḍāḍide navvarā nannu
yĕḍamichchi nīvĕ nannuyiṭṭĕ manniṁcham̐ jūsevu
paḍam̐tuladonanĕlla pachchigādā nāgu

(||nīvĕṁ||)
sarinuṁḍi yābĕ nīdo sarasamāḍeḍi veḽa
varusa vaṁtaḍugaṁga vaibā nāgu
taralaga kŏṁguvaṭṭi daggara nannum̐dīsevu
taruṇulabai kŏsaru tagavā nāgu

(||nīvĕṁ||)
vŏṁṭinuṁḍi yābĕ nīgunūḍigālu seyarām̐gā
jaṁṭai nem̐ dirigedi saravā nāgu
vĕṁṭane śhrīveṁkaḍādri vĕnnamudda kriṣhṇarāya
aṁṭi nannum̐ gūḍidivi arudāya nāgu