Neevemta sesinaanu nee sitta mimte kaaga

నీవెంత సేసినాను నీ చిత్త మింతే కాక
Language

(॥పల్లవి॥)
నీవెంత సేసినాను నీ చిత్త మింతే కాక
కైవసమైన యాతఁడు కాంతాళించీనా

(॥॥)
నెట్టుకొని యీడనుండి నీతోనే మాటలాడీ
పట్టిన చలము మాని పలుకరాదా
యిట్టె యెందో వుండె నంటా నింత సేతురా నీవు
గుట్టుతోడివాఁ డతఁడు కోపగించీనా

(॥॥)
అప్పటి నీ తిట్లకు నాతఁ డట్టే నవ్వు నవ్వీ
రెప్ప లెత్తి చూడరాదా రేసు లేఁటికే
చెప్పించుకొందురా నీవు చేతికి లోనై నందుకు
తప్పులేనివాఁ డతఁ డు తమకించీనా

(॥॥)
కన్నులనే నీకు మొక్కి కౌఁగిలించీ నాతఁడు
యిన్నేసి మతకా లేల, యెనయ రాదా
సన్నల శ్రీవేంకటేశుఁ జన విచ్చి కూడితివి
మన్నించి లోనై నతఁ డు మారుకొనీనా.

(||pallavi||)
nīvĕṁta sesinānu nī sitta miṁte kāga
kaivasamaina yādam̐ḍu kāṁtāḽiṁchīnā

(||||)
nĕṭṭugŏni yīḍanuṁḍi nīdone māḍalāḍī
paṭṭina salamu māni palugarādā
yiṭṭĕ yĕṁdo vuṁḍĕ naṁṭā niṁta sedurā nīvu
guṭṭudoḍivām̐ ḍadam̐ḍu kobagiṁchīnā

(||||)
appaḍi nī tiṭlagu nādam̐ ḍaṭṭe navvu navvī
rĕppa lĕtti sūḍarādā resu lem̐ṭige
sĕppiṁchugŏṁdurā nīvu sedigi lonai naṁdugu
tappulenivām̐ ḍadam̐ ḍu tamagiṁchīnā

(||||)
kannulane nīgu mŏkki kaum̐giliṁchī nādam̐ḍu
yinnesi madagā lela, yĕnaya rādā
sannala śhrīveṁkaḍeśhum̐ jana vichchi kūḍidivi
manniṁchi lonai nadam̐ ḍu mārugŏnīnā.