Neevemta daamsina navi nemdu daamgeenaa

నీవెంత దాఁచిన నవి నేఁడు దాఁగీనా
Language

(॥పల్లవి॥)
నీవెంత దాఁచిన నవి నేఁడు దాఁగీనా
చేవదేరిఁ దొల్లిటట్టే సేయరాదా పనులు

(॥నీవెంత॥)
వనిత నిన్నుఁ బిలిచి వలపులు చల్లఁగాను
నినుఁ గానివానివలె నిలుచున్నాఁడవు యీడ
యెనసి నే నెరిఁగితే నిఁక నేల నీకుఁ గొంక
చెనకి వెల్లవిరిగాఁ జేయరాదా పనులు

(॥నీవెంత॥)
తమకించు యాకె నిన్ను దగ్గరి చే వట్టఁగాను
బ్రమసిన వానివలెఁ బరాకు సేసుకొనేవు
అమరఁగ నేనా కంటి నడ్డము లేదిఁక మేను
చెమరించ నేల మీరి సేయరాదా పనులు

(॥నీవెంత॥)
ఇంతి నీవు లోనఁ గూడి యిట్టె నన్నుఁ గనివచ్చి
వంతుకు నాకాఁగిటిలో వాడుదేరేవు
అంతటి శ్రీవేంకటేశ యలమేలుమంగ నేను
చింతదీరఁ గూడితిమి సేయరాదా పనులు

(||pallavi||)
nīvĕṁta dām̐sina navi nem̐ḍu dām̐gīnā
sevaderim̐ dŏlliḍaṭṭe seyarādā panulu

(||nīvĕṁta||)
vanida ninnum̐ bilisi valabulu sallam̐gānu
ninum̐ gānivānivalĕ nilusunnām̐ḍavu yīḍa
yĕnasi ne nĕrim̐gide nim̐ka nela nīgum̐ gŏṁka
sĕnagi vĕllavirigām̐ jeyarādā panulu

(||nīvĕṁta||)
tamagiṁchu yāgĕ ninnu daggari se vaṭṭam̐gānu
bramasina vānivalĕm̐ barāgu sesugŏnevu
amaram̐ga nenā kaṁṭi naḍḍamu ledim̐ka menu
sĕmariṁcha nela mīri seyarādā panulu

(||nīvĕṁta||)
iṁti nīvu lonam̐ gūḍi yiṭṭĕ nannum̐ ganivachchi
vaṁtugu nāgām̐giḍilo vāḍuderevu
aṁtaḍi śhrīveṁkaḍeśha yalamelumaṁga nenu
siṁtadīram̐ gūḍidimi seyarādā panulu