నీవేమి సేసినాను నీ చిత్తము
(॥పల్లవి॥)
నీవేమి సేసినాను నీ చిత్తము
భావము వేరొకటై పదర నేఁ జాలను
(॥నీవే॥)
కొంగువట్టితే నిన్నుఁ గోపగించఁజాలను
అంగజగురుఁడవు నీ వటుగాన
అంగడి నవ్వి నిన్ను నదలించఁజాలను
వెంగలిపదారువేలవిభుఁడవుగాన
(॥నీవే॥)
పూవుల వేసి నిన్నుఁ బొరిఁ దిట్టజాలను నీ-
వవ్వలఁ బారిజాతహరుఁడవుగాన
రవ్వల గోరంటఁగాను రాయడించఁజాలను
చివ్వలగోళ్ల నరసింహుఁడవుగాన
(॥నీవే॥)
చనుఁగొండ లొత్తఁగాను చాలుననఁజాలను
యెనసి గోవర్దనగి రెత్తితివిగాన
మునుపె శ్రీవేంకటేశ మొక్కి నన్నుఁ గూడితివి
తనిసినా నిన్నుఁ బాసి తలమనఁజాలను
(||pallavi||)
nīvemi sesinānu nī sittamu
bhāvamu verŏgaḍai padara nem̐ jālanu
(||nīve||)
kŏṁguvaṭṭide ninnum̐ gobagiṁcham̐jālanu
aṁgajagurum̐ḍavu nī vaḍugāna
aṁgaḍi navvi ninnu nadaliṁcham̐jālanu
vĕṁgalibadāruvelavibhum̐ḍavugāna
(||nīve||)
pūvula vesi ninnum̐ bŏrim̐ diṭṭajālanu nī-
vavvalam̐ bārijādaharum̐ḍavugāna
ravvala goraṁṭam̐gānu rāyaḍiṁcham̐jālanu
sivvalagoḽla narasiṁhum̐ḍavugāna
(||nīve||)
sanum̐gŏṁḍa lŏttam̐gānu sālunanam̐jālanu
yĕnasi govardanagi rĕttidivigāna
munubĕ śhrīveṁkaḍeśha mŏkki nannum̐ gūḍidivi
tanisinā ninnum̐ bāsi talamanam̐jālanu