Neevemi seduvu ninnanamgam baniledu

నీవేమి సేతువు నిన్ననఁగఁ బనిలేదు
Language

(॥పల్లవి॥)
నీవేమి సేతువు నిన్ననఁగఁ బనిలేదు
చేవదేరఁ జేసినవి సిగ్గులే కావా

(॥నీవే॥)
వుడివోనియట్టి యాస లొకటొకటె రేఁచి
బడలించినది నాప్రాయమే కాదా
అడరి నీ మోము చూపి ఆయములు గరఁగించి
తడఁబరచినది నా తమకమే కాదా

(॥నీవే॥)
తనువుపైఁ గాఁకరేఁచి తరితీపు చేసినది
మొనసిన నాలోని మోహమే కాదా
వొనర నీరతులకు నుడిగట్టఁజేసినది
వెనువెంటఁ దిరిగే నావేడుకే కాదా

(॥నీవే॥)
నా యిచ్చ కొలఁదినే నన్ను నిన్నుఁ గూడించి
పాయనీకుండినది నాభాగ్యమే కాదా
యీయెడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చాయకుఁ దెచ్చినది యీ సరసమే కాదా

(||pallavi||)
nīvemi seduvu ninnanam̐gam̐ baniledu
sevaderam̐ jesinavi siggule kāvā

(||nīve||)
vuḍivoniyaṭṭi yāsa lŏgaḍŏgaḍĕ rem̐si
baḍaliṁchinadi nāprāyame kādā
aḍari nī momu sūbi āyamulu garam̐giṁchi
taḍam̐barasinadi nā tamagame kādā

(||nīve||)
tanuvubaim̐ gām̐karem̐si taridību sesinadi
mŏnasina nāloni mohame kādā
vŏnara nīradulagu nuḍigaṭṭam̐jesinadi
vĕnuvĕṁṭam̐ dirige nāveḍuge kādā

(||nīve||)
nā yichcha kŏlam̐dine nannu ninnum̐ gūḍiṁchi
pāyanīguṁḍinadi nābhāgyame kādā
yīyĕḍa śhrī veṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
sāyagum̐ dĕchchinadi yī sarasame kādā