నీవేమి సేతువు నన్నునీవు మోహించు మంటివా
(॥పల్లవి॥)
నీవేమి సేతువు నన్నునీవు మోహించు మంటివా
వావాదు నెంచేది నా వలపింతే కాక
(॥॥)
నీ యిచ్చకాఁడవు తొల్లే నీ వెవ్వతెవద్ద నున్నా
నాయమా నిన్ను దూర నడుమ నేను
యీయడఁ బూవుటమ్ముల సేసేటిమరుని నే
చాయల నే మాడినాను సంగతెవుఁ గాక
(॥॥)
చెల్లు బడి వాఁడవు నే సేసినదే చేఁత గాక
పల్లదానఁ గొంగు వట్ట భావ్యమా నాకు
మల్లాడి తమకించేటి మక్కువ నా మనసునే
మెల్లనే యెంత వొత్తినా మే లింతే కాక
(॥॥)
శ్రీ వేంకటేశ నీ చేతిదే భాగ్యము గాక
వావి గద్దంటాఁ బెనఁగ వసమా నేఁడు
యీ వేళ నన్నుఁ గూర్చిన యిట్టి నా జవ్వనమునే
చేవ మీర నిట్టే సంతోసించు కొంట గాక
(||pallavi||)
nīvemi seduvu nannunīvu mohiṁchu maṁṭivā
vāvādu nĕṁchedi nā valabiṁte kāga
(||||)
nī yichchagām̐ḍavu tŏlle nī vĕvvadĕvadda nunnā
nāyamā ninnu dūra naḍuma nenu
yīyaḍam̐ būvuḍammula seseḍimaruni ne
sāyala ne māḍinānu saṁgadĕvum̐ gāga
(||||)
sĕllu baḍi vām̐ḍavu ne sesinade sem̐ta gāga
palladānam̐ gŏṁgu vaṭṭa bhāvyamā nāgu
mallāḍi tamagiṁcheḍi makkuva nā manasune
mĕllane yĕṁta vŏttinā me liṁte kāga
(||||)
śhrī veṁkaḍeśha nī sedide bhāgyamu gāga
vāvi gaddaṁṭām̐ bĕnam̐ga vasamā nem̐ḍu
yī veḽa nannum̐ gūrsina yiṭṭi nā javvanamune
seva mīra niṭṭe saṁtosiṁchu kŏṁṭa gāga