నీవేమి సేతువయ్య నేరమి నాదే కాక
(॥పల్లవి॥)
నీవేమి సేతువయ్య నేరమి నాదే కాక
కావిరి నా యాసలకుఁ గడమ లేదు
(॥॥)
కొంతపడి నీరాక గోరుదు నీవు వచ్చితే
అంతమీఁద నీతో మాటలాడఁగోరుదు
చెంత మాటలఁ దనిసి చేయివేయఁ గోరుదు
దొంతుల నాయాసలకు తుద యెందు లేదు
(॥॥)
ముచ్చట నొకవేళ నీమోము చూడవలె నందు
వచ్చి యామీఁద నీమోవి వలె నందును
కచ్చు పెట్టి రాఁగా రాఁగా గాఁగిలించవలెనందు
అచ్చపు నాయాసలకు నరకువే లేదు
(॥॥)
మేనులంటినట్టిచోట మేలములే కొసరుదు
కోనల నప్పటి రతి గొసరుదును
కానీలే శ్రీవేంకటేశ కై కొని కూడితి నన్ను
మేనిలోనియాసలకు మితి మేర లేదు
(||pallavi||)
nīvemi seduvayya nerami nāde kāga
kāviri nā yāsalagum̐ gaḍama ledu
(||||)
kŏṁtabaḍi nīrāga gorudu nīvu vachchide
aṁtamīm̐da nīdo māḍalāḍam̐gorudu
sĕṁta māḍalam̐ danisi seyiveyam̐ gorudu
dŏṁtula nāyāsalagu tuda yĕṁdu ledu
(||||)
muchchaḍa nŏgaveḽa nīmomu sūḍavalĕ naṁdu
vachchi yāmīm̐da nīmovi valĕ naṁdunu
kachchu pĕṭṭi rām̐gā rām̐gā gām̐giliṁchavalĕnaṁdu
achchabu nāyāsalagu naraguve ledu
(||||)
menulaṁṭinaṭṭisoḍa melamule kŏsarudu
konala nappaḍi radi gŏsarudunu
kānīle śhrīveṁkaḍeśha kai kŏni kūḍidi nannu
meniloniyāsalagu midi mera ledu