Neevemi seduvayya neevu mamchivaamdavu

నీవేమి సేతువయ్య నీవు మంచివాఁడవు
Language

(॥పల్లవి॥)
నీవేమి సేతువయ్య నీవు మంచివాఁడవు
ఆవల నీ పాపము నిన్ననఁ జోటేది

(॥॥)
పాయపు నా వయసేకా పాసినప్పుడెల్ల నిన్ను
తోయపు మాటల నిన్ను దూరించెను
దాయి దండయినా తమకము లివియేకా
సేయరాని వినయాలు సేయించెను

(॥॥)
తెగని నామనసేకా దిన దినమాసలనే
వెగటుగ నీ వెంటవెంటఁ దెప్పించె
మొగము చూచి నా మొగమోట మిదియేకా
నగుతానేమిటికైన నన్నేడి గట్టించెను

(॥॥)
పొంచిన నా జన్మమేకా పొందు సేసీ నీతోడ
లంచపు కౌఁగిట లోలో లంకె బెట్టెను
యెంచఁగ శ్రీ వేంకటేశ యిట్టే నన్ను గూడితివి
మించిన నారతులెల్ల మెప్పంచెనూ.

(||pallavi||)
nīvemi seduvayya nīvu maṁchivām̐ḍavu
āvala nī pābamu ninnanam̐ joḍedi

(||||)
pāyabu nā vayasegā pāsinappuḍĕlla ninnu
toyabu māḍala ninnu dūriṁchĕnu
dāyi daṁḍayinā tamagamu liviyegā
seyarāni vinayālu seyiṁchĕnu

(||||)
tĕgani nāmanasegā dina dinamāsalane
vĕgaḍuga nī vĕṁṭavĕṁṭam̐ dĕppiṁchĕ
mŏgamu sūsi nā mŏgamoḍa midiyegā
nagudānemiḍigaina nanneḍi gaṭṭiṁchĕnu

(||||)
pŏṁchina nā janmamegā pŏṁdu sesī nīdoḍa
laṁchabu kaum̐giḍa lolo laṁkĕ bĕṭṭĕnu
yĕṁcham̐ga śhrī veṁkaḍeśha yiṭṭe nannu gūḍidivi
miṁchina nāradulĕlla mĕppaṁchĕnū.